ఉన్నతాధికారులపై ట్రెయినీ కానిస్టేబుళ్ల దాడి... ( వీడియో)

By Arun Kumar PFirst Published Nov 2, 2018, 8:22 PM IST
Highlights

 పోలీస్ ట్రెయినింగ్ అకాడమీలోని ఉన్నతాధికారులపై ట్రయినీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా ట్రయినీ కానిస్టేబుల్ మరణించడంతో భావోద్వేగానికి లోనైన వారు కర్రలు, ఆయధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. 

 పోలీస్ ట్రెయినింగ్ అకాడమీలోని ఉన్నతాధికారులపై ట్రయినీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా ట్రయినీ కానిస్టేబుల్ మరణించడంతో భావోద్వేగానికి లోనైన వారు కర్రలు, ఆయధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాట్నాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్ బ్యాచ్ కు శిక్షణ కొనసాగుతోంది. అయితే ఈ శిక్షణలో వున్న ఓ మహిళకు తీవ్ర జ్వరం రావడంతో అక్కడ ఉండలేక ఉన్నతాధికారులను సెలవు కావాలని కోరింది. అయితే అందుకు ఉన్నతాదుకారులు అంగీకరించలేదు. దీంతో అనారోగ్యంతో బాధపడుతూ సదరు మహిళ మృతిచెందింది.

ఆమె మరణంతో తోటి ట్రయినీ కానిస్టేబుల్ అభ్యర్థులు బావోద్వేగంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అధికారులు సెలవు ఇవ్వకపోవడం వల్లే ఆమె మరణించిదంటూ ఓ కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను చితక్కొట్టారు. పదునైన ఆయుధాలతో దాడికి తెగబడటంతో పాటు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అలాగే అక్కడున్న పోలీస్ వాహనాలను కూడా ద్వంసం చేశారు.  దీంతో అకాడమీలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. 

ఈ దాడిలో కమాండెంట్ తో పాటు మరికొందను తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అకాడమీలో మళ్లీ  ఆందోళన చెలరేగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీడియో

Patna: Police personnel protest and create ruckus allegedly after an ailing woman constable passed away due to lack of treatment.Protesters claim the commandant did not grant her an adequate leave period to get treated.The commandant was injured after being thrashed by protesters pic.twitter.com/GtJbgN1owL

— ANI (@ANI)


 

click me!