పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?

By narsimha lodeFirst Published Oct 19, 2018, 9:10 PM IST
Highlights

పంజాబ్ రాష్ట్రంలోని  అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనం సందర్భంగా జరిగిన రైలు ప్రమాదం బాణసంచా శబ్దాల వల్ల రైలు వచ్చే విషయాన్ని గమనించలేదని అంటున్నారు.
 

జలంధర్: పంజాబ్ రాష్ట్రంలోని  అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనం సందర్భంగా జరిగిన రైలు ప్రమాదం బాణసంచా శబ్దాల వల్ల రైలు వచ్చే విషయాన్ని గమనించలేదని అంటున్నారు.

దసరా ఉత్సవాల్లో భాగంగా  అమృత్‌సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనాన్ని నిర్వహిస్తున్నారు. రావణ దహనం చేస్తుండగా భారీ ఎత్తున  బాణసంచా పేల్చారు. ఈ శబ్దాలకు దూరంగా వస్తున్న రైలు శబ్దాన్ని  ప్రజలు గుర్తించలేకపోయారు. రైల్వేట్రాక్ పై నిల్చొని  రావణ దహనాన్ని తిలకిస్తున్నవారు రైలును తమ సమీపంలోకి వచ్చే వరకు కూడ గుర్తించలేకపోయారు.

రైలు వచ్చిన విషయాన్ని గమనించి పట్టాల నుండి తప్పుకోనే లోపుగానే ఘోర ప్రమాదం వాటిల్లింది. పట్టాలపై నిల్చున్నవారిని ఢీకొట్టుకొంటూ రైలు దూసుకెళ్లింది. దీంతో  50  మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.

రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా ఇవ్వలేదు. రైలు పట్టాలకు పక్కనే ఉన్న మైదాన ప్రాంతంలో రావణ దహనం చేస్తున్నారు. రైల్వే శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా 50 మందికి పైగా మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం

 

 

click me!