విషాదం.. బావి శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ముగ్గురు మృతి

By Asianet NewsFirst Published May 22, 2023, 6:51 AM IST
Highlights

హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. బావిని శుభ్రం చేసేందుకు లోపలకు దిగిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. లోపల వెలువడిన విష వాయువుల పీల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

బావి శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో బావి లోపలికి దిగిన ముగ్గురు వ్యక్తులు ఆ విష వాయువులను పీల్చి చనిపోయారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. 

ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం

వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం సహర్వా గ్రామంలో ఓ తాగు నీటి బావి ఉంది. అందులో చెత్తా చెదారం పేరుకుపోవడంతో, దానిని శుభ్రం చేయడానికి స్థానికంగా ఉండే జైపాల్, నరేంద్ర, సురేష్, విక్రమ్ లు పనికి కుదిరారు. ఇందులో జైపాల్ బావిలోకి దిగి శుభ్రం చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడ ఒక్క సారిగా విష వాయువులు వెలువడ్డాయి. అవి పీల్చడంతో జైపాల్ స్పృహ కోల్పోయాడు. 

లోపలికి వెళ్లి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకుందామని నరేంద్ర లోపలికి వెళ్లాడు. అతడు కూడా విషవాయువులు పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బయట ఉన్న విక్రమ్, సురేష్ లు కంగారుపడ్డారు. వీరిద్దరినీ కాపాడేందుకు ఈ ఇద్దరూ బావిలోకి దిగారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అందులో ఉన్న విషవాయువులు పీల్చడంతో సురేష్ కూడా పస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

బెంగళూరు భారీ వర్షం.. అండర్​ పాస్ లో చిక్కుకున్న కారు.. ఏపీ మహిళ సాఫ్ట్‌వేర్‌ మృతి..

దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న విక్రమ్ వెంటనే బావిలో నుంచి బయటకు వచ్చాడు. బయట ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆ ముగ్గురు చనిపోయారు. పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.

"నేను ఏ పరీక్షకైనా సిద్దమే, కానీ.. వారిద్దరికీ కూడా చేయాలి? " : డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్

ఇలాంటి ఘటనే ఇటీవల తమిళనాడులో చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా వెలువడిన విషవాయువులు పీల్చి ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మరణించారు. పుళల్ సమీపంలోని గురుశాంతి నగర్ కు చెందిన నిర్మల వద్ద కవంగరైలోని కొండియమ్మన్ నగర్ కు చెందిన భాస్కరన్ (52), ఇస్మాయిల్ (36) అనే భార్య భర్తలు పని చేస్తున్నారు. వీరితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో కార్మికుడు గణేశన్ కూడా ఆమె వద్ద పని చేస్తున్నారు. అయితే యజమాని ఆదేశాలతో ఆ ముగ్గురు సెప్టింగ్ ట్యాంక్ క్లీన్ చేసే పనిని మొదలు పెట్టారు. అయితే విషవాయువులు వెలువడటంతో వారు చనిపోయారు. 
 

click me!