
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. సేలం జిల్లా సంగకరగిరి మండలం కల్వదంగం గ్రామం వద్ద కావేరి నదిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. మృతులను సేలంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఎం.మణికందన్ (20), ఎం.సెల్వం (20), మణికందన్ (20), పాండ్యరాజన్ (20)గా గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కావేరీ నదిలో స్నానం చేసేందుకు 15 మంది కళాశాల విద్యార్థుల బృందం గురువారం కల్వదంగం చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ విద్యార్థి నదిలోకి దిగి చిక్కుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ముగ్గురు స్నేహితులు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో నీటి ప్రవాహం వేగం ఎక్కువగా ఉంది. దీంతో వారు అందులోనే మునిగిపోయారు. ఈ నలుగురికి ఈత రాకపోవడంతో బయటకు రాలేకపో చనిపోయారు.
ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ అసద్ అహ్మద్ హతం.. యూపీ సీఎం యోగికి థ్యాంక్స్ చెప్పిన ఉమేష్ పాల్ భార్య..
ఈ ఘటనపై మిగతా విద్యార్థులు గ్రామస్తులకు సమాచారం. వారంతా అక్కడికి తరలివచ్చారు. కొంత సమయం తరువాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు.
హనుమాన్ జయంతి ర్యాలీలో హింసాకాండ.. మత ఘర్షణలో 10 మంది పోలీసులకు గాయాలు.. వాహనాలకు నిప్పు
ఈ విషాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థులు విహారయాత్రలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని కోరారు.