చిన్నారిని చాకచక్యంగా కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్.. పోలీసులు సలాం కొడుతున్న నెటిజన్లు..

Published : Jun 29, 2022, 11:25 AM IST
చిన్నారిని చాకచక్యంగా కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్.. పోలీసులు సలాం కొడుతున్న నెటిజన్లు..

సారాంశం

ఓ ట్రాఫిక్ పోలీస్ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో ఓ చిన్నారి దారుణ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇదంతా అక్కడి సీసీ టీవీలో నమోదయ్యింది.  

ఉత్తరాఖండ్ : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్ల మీద పిల్లను తీసుకువెళ్లేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలను కాపాడుకుంటూ ఉండాలి. నిర్లక్ష్యంగా వదిలిపెడితే పరిస్థితులు భయంకరంగా మారిపోతాయి. తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్నారిని ట్రాఫిక్ పోలీస్ కాపాడిన తీరును చూడొచ్చు. 

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఈ ఘటన జరిగింది. ఒక ట్రాఫిక్ పోలీస్ రద్దీగా ఉన్న రోడ్డులో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ రిక్షా నుంచి ఓ చిన్నారి జారి రోడ్డు మీద పడిపోయింది. అది గమనించిన ట్రాఫిక్ పోలీస్ హుటాహుటిన ఆ చిన్నారి దగ్గరికి చేరుకున్నాడు. ఆ చిన్నారి మీదికి ఏ వాహనం రాకుండా అడ్డుకుని వెంటనే ఆ పాపను ఎత్తుకుని పక్కకు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. చిన్నారిని రక్షించిన పోలీస్ మీద  అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu