మహా అసెంబ్లీలో బలపరీక్ష:గవర్నర్ ఆదేశాలపై సుప్రీంలో శివసేన పిటిషన్

Published : Jun 29, 2022, 10:36 AM ISTUpdated : Jun 29, 2022, 10:57 AM IST
మహా అసెంబ్లీలో బలపరీక్ష:గవర్నర్ ఆదేశాలపై సుప్రీంలో శివసేన పిటిషన్

సారాంశం

మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష చేసుకోవాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ దాఖలు చేసింది.  గవర్నర్ అసెంబ్లీలో బలపరీక్ష చేసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఆదేశించిన నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టులో బుధశారం నాడు ఈ పిటిషన్ దాఖలు చేసింది.

న్యూఢిల్లీ:  రేపు బలపరీక్షపై మహారాష్ట్ర Governor ఆదేశాలను సవాల్ చేస్తూ Supreme Court లో Shiv Sena  బుధవారం నాడు  Petiton దాఖలు చేసింది.  అసెంబ్లీలో Floor Test నిరూపించుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ శివసేన నేతలు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ నెల 30వ తేదీ లోపుగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కోరారు. ఈ ప్రక్రియను రికార్డు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.  ఈ మేరకు అసెంబ్లీని ఈ నెల 30న ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశపర్చాలని కూడా గవర్నర్ అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు.  ఈ లేఖ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కానున్నాయి. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే న్యాయ నిపుణులతో చర్చించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బల నిరూపణ చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ దాఖలు చేసింది. 

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో  మాజీ సీఎం, బీజేపీ నేత దేవేద్ర ఫడ్నవీస్ ఇటీవలనే భేటీ అయ్యారు. మరో వైపు మంగళవారం నాడు బీజేపీ అగ్రనేతలతో  ఫడ్నవీస్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వివరించారు.  

మహారాష్ట్రలో శివసేనలో చోటు చేసుకొన్న సంక్షోభాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అడుగులు చూస్తే ఇదే రకమైన అభిప్రాయం కలుగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. శివసేన రెబెల్ వర్గాన్ని కలుపుకొని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

also read:రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. గవర్నర్ కీలక ఆదేశం.. ముంబై చేరుకోనున్న షిండే వర్గం..

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అసోంలోని గౌహతిలోనే ఉన్నారు. రేపు అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో అసమ్మతి  ఎమ్మెల్యేలు అసోం నుండి ముంబైకి రానున్నారు. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలు తాము ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతును ఉపసంహరించుకొన్నామని కూడా లేఖ పంపారు.

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు  మంగళవారం నాడు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే లేఖ రాశారు. సమస్యను పరిష్కరించుకుందామని ఆయన  ఆ లేఖలో పేర్కొన్నారు. ముంబైకి రావాలని కూడా కోరారు. మరో వైపు అసమ్మతి ఎమ్మెల్యేల్లో కొందరు తమతో టచ్ లో ఉన్నారని కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రకటించింది. ఈ ప్రకటనను ఏక్‌నాథ్ షిండే తోసిపుచ్చుతున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?