అనిల్ అంబానీకి సుప్రీంలో ఎదురు దెబ్బ: నేపథ్యమిదే

By narsimha lodeFirst Published Feb 20, 2019, 11:40 AM IST
Highlights

ఎరిక్సన్ సంస్థకు అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు పడిన బకాయిలను చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలకమైన తీర్పును వెలువరించింది

న్యూఢిల్లీ: ఎరిక్సన్ సంస్థకు అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు పడిన బకాయిలను చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలకమైన తీర్పును వెలువరించింది.మూడు కోర్టు ధిక్కార పిటిషన్లపై ఈ తీర్పును వెలువరించింది.

అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఎరిక్సన్ అనే కంపెనీ మూడు కోర్టు ధిక్కార పిటిషన్లను సుప్రీంలో దాఖలు చేసింది. ఈ కేసు విషయమై  జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, వినీత్ శరణ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 13న విచారణ జరిపింది. ఆ రోజున తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ తీర్పును వెలువరించారు.రాఫెల్ డీల్‌ పెట్టుబడిలో భాగంగా తమ వద్ద నుండి తీసుకొన్న రూ.550 కోట్లను ఇంతవరకు చెల్లించలేదని ఆ సంస్థ ఆరోపిస్తోంది. 

అయితే ఎరిక్సన్ కంపెనీకి బకాయిల చెల్లింపు విషయంలో అనిల్ అంబానీ వాదన మరో రకంగా ఉంది.  తమ ఆర్ కామ్ సంస్థకు చెందిన ఆస్తుల విక్రయం ఫెయిల్ కావడంతో ఇబ్బందులు తలెత్తినట్టు అనిల్ అంబానీ ప్రకటించారు.

ఆర్‌కామ్ సంస్థను జియో సంస్థ కొనుగోలులో చోటు చేసుకొన్న ప్రతిష్టంభన కారణంగా నిధుల విడుదలలో జాప్యం చోటు చేసుకొందని అనిల్  అంబానీకి చెందిన కంపెనీ సుప్రీంకోర్టుకు చెప్పింది.

అయితే తమకు బకాయిలు చెల్లించాలని కోర్టును ఎరిక్సన్ సంస్థ అనిల్ అంబానీ సంస్థలపై మూడు కోర్టు ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ టెలికాం ఛైర్మెన్ సతీష్ సేత్,  రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ ఛైర్‌పర్సన్ చాయ విరానీ, ఎస్బీఐ ఛైర్మెన్ల‌ను ఎరిక్సన్ సంస్థ చేర్పించింది.

గత ఏడాది డిసెంబర్  15వ తేదీ లోపుగా  ఈ బకాయిలను చెల్లించాలని కోర్టు ఈ తీర్పును  చెప్పింది.కానీ ఈ తీర్పుకు అనుగుణంగా  బకాయిలు చెల్లించనందుకు గాను కోర్టు అనిల్ అంబానీకీ నాలుగు వారాల్లో  ఎరిక్సన్ సంస్థకు డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ గడువులోపుగా చెల్లించకపోతే మూడు మాసాల పాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు చెప్పింది. మరో వైపు కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకుగాను రూ.కోటి రూపాయాలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

రూ.450 కోట్లు చెల్లించకుంటే జైలు శిక్షే : అనిల్‌ అంబానీకి సుప్రీం షాక్

 

click me!