రూ.450 కోట్లు చెల్లించకుంటే జైలు శిక్షే : అనిల్‌ అంబానీకి సుప్రీం షాక్

By narsimha lodeFirst Published Feb 20, 2019, 10:55 AM IST
Highlights

రిలయన్స్ గ్రూప్ సంస్థ ఛైర్మెన్ అనిల్ అంబానీ  ఎరిక్సన్ సంస్థకు రూ.450 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులను చెల్లించకపోతే  మూడు మాసాల పాటు జైలుకు వెళ్లాలని కోర్టు  ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

రిలయన్స్ గ్రూప్ సంస్థ ఛైర్మెన్ అనిల్ అంబానీ  ఎరిక్సన్ సంస్థకు రూ.450 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులను చెల్లించకపోతే  మూడు మాసాల పాటు జైలుకు వెళ్లాలని కోర్టు  ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

ఎరిక్సన్ కంపెనీకి రూ. 450 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకుగాను రూ. కోటి రూపాయాలను చెల్లించాలని ఆదేశించింది.

ఎరిక్సన్ కంపెనీ అనిల్ అంబానీ కంపెనీపై  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి బుధవారం నాడు అంబానీకి షాక్‌ కలిగేలా తీర్పును వెలువరించింది.

ఎరిక్సన్ కంపెనీకి గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి  బకాయిలను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను గత ఏడాది  అక్టోబర్ 28వ తేదీన వెలువరించింది.అంతేకాదు ఆలస్యంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తే ఏడాదికి 12 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని కూడ సుప్రీం ఆదేశించింది.

తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లను చెల్లించకుండా అనిల్ అంబానీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని  ఎరిక్సన్ సంస్థ ఆరోపించింది.  తమకు చెల్లించాల్సిన నిధులను చెల్లించకపోవడంతో  ఎరిక్సన్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు  ఈ మేరకు బుధవారం నాడు తాజా ఉత్తర్వులను జారీ చేసింది.

 

click me!