Tomatoes price: మామిడి కంటే ట‌మాటో ధ‌ర‌లే అధికం.. కిలో రేటు సెంచ‌రీ పైనే.. !

Published : May 25, 2022, 12:57 PM IST
Tomatoes price:  మామిడి కంటే ట‌మాటో ధ‌ర‌లే అధికం.. కిలో రేటు సెంచ‌రీ పైనే.. !

సారాంశం

Tomatoes turn costlier than mangoes: ట‌మాట ధ‌ర‌లు మండిపోతున్నాయి. గ‌త రెండు వారాల్లోనే రెట్టింపు ధ‌ర‌లు పెర‌గ‌డంతో దేశంలోని చాలా చోట్ల కేజీ ట‌మాటో ధ‌ర సెంచ‌రీ దాటింది.  

Retail tomato price: రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ట‌మాటో ధ‌ర‌లు ఆకాశానంటున్నాయి. మామిడి ధ‌ర‌ల కంటే ట‌మాట ధ‌ర‌లే ఇప్పుడు అధికంగా ఉన్నాయి. ఇప్ప‌టికే దేశంలోని అనేక ప్రాంతాల్లో కేజీ ట‌మాటో ధ‌ర సెంచ‌రీ కొట్టింది. రానున్న రోజుల్లో 150 రూపాయ‌ల వ‌ర‌కు కేజీ టామాటో ధ‌ర ప‌లికే అవ‌కాశ‌లున్నాయ‌ని మార్కెట్ వర్గాలు పెర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కార‌ణం సరఫరా-డిమాండ్ అసమతుల్యతనేని మార్కెట్ వ‌ర్గాలు తెలిపాయి. ఎండ‌ల తీవ్రత, అకాల వ‌ర్షాల కార‌ణంగా పంట దిగుబ‌డి త‌గ్గ‌డంతో ట‌మాట స‌ర‌ఫ‌రా త‌క్కువ‌గా ఉంది. డిమాండ్ గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. 

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మామిడికాయల కంటే టమాటా ధరలు  రూ.20 అధికంగా ఉన్నాయి. ట‌మాటాను రిటైల్ మార్కెట్‌లో కిలో 100 రూపాయలకు పైనే విక్ర‌యిస్తున్నారు. హైదరాబాద్‌లో టమాట ధర రిటైల్ మార్కెట్‌లో కిలోకు 90-110 రూపాయలు ఉండగా.. మామిడి పండ్లను కిలోకు 50-80 రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నగరంలో టమాటా ధరలు రూ. 10,  మే మొదటి వారంలో కిలో 60కి చేరింది. క్ర‌మంగా పెరుగుతూ సెంచ‌రీ దాటింది. అలాగే, ఏపీలోని  యెమ్మిగనూరు, ఆదోని, కర్నూల్ ల‌లో  రిటైల్‌ దుకాణాల్లో ట‌మాటా కిలో రూ.130కి విక్రయించడంతో టమాటా ధరల ఆకాశాన్నంటాయి. కొరత కారణంగా రాయలసీమ జిల్లాల్లోని వినియోగదారులు కర్ణాటకలోని మద్నపల్లె, అన్నమయ్య జిల్లా, చింతామణి నుంచి వచ్చే ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ఇటీవలి కాలంలో టమోటా వ్యాపారం జరిగే రాష్ట్రంలోనే అతిపెద్ద యార్డులలో ఒకటైన పత్తికొండలోని హోల్‌సేల్ మార్కెట్‌లో టమోటాలు గరిష్టంగా కిలోకు రూ.80 నుండి రూ.90 వరకు విక్రయించబడ్డాయి. కర్నూలులో ఆగస్టు-ఫిబ్రవరి మధ్యకాలంలో టమోటాలు పండుతాయి. సీజన్‌ ప్రారంభం కాగానే పత్తికొండ హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఆగస్టులో కిలో రూ.4కు విక్రయించిన ప‌రిస్థితులు కూడా ఉన్నాయి.  అయితే, ప్ర‌స్తుతం రైతుబజార్‌లో రూ.80కి ఎగబాకి, రిటైల్‌ కూరగాయల మార్కెట్‌లో రూ.130కి చేరాయి.ధర పెరగడంపై అధికారులు అంచనా వేస్తున్నారు. జులై చివరి వరకు ఇదే ప‌రిస్థితి ఉండ‌వ‌చ్చ‌నీ, ట‌మాట  కిలోకు రూ. 150కి కూడా చేరవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ జిల్లాలో సుమారు 15 వేల హెక్టార్లలో టమాట సాగవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, లోటు వర్షపాతం కారణంగా దిగుబడి 60 శాతం పడిపోయింది. 

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోనూ ట‌మాటా ధ‌ర‌లు రికార్డులు సృష్టిస్తున్నాయి.  1 కేజీ టమోటా రిటైల్ ధర రూ.100 మార్కును అధిగమించింది. గత రెండు వారాల్లో ట‌మాట‌ ధర దాదాపు రెండింతలు పెరిగింది. పాలి మార్కెట్ బాంద్రా, మాతుంగా, ములుండ్ మరియు బైకుల్లాతో పాటు ఆన్‌లైన్ స్టోర్‌లలో 1 కిలోల టమోటాలు సెంచరీ మార్కును దాటాయి.  ఖార్, అంధేరీ లోఖండ్‌వాలా, మహాలక్ష్మిలలో చిన్న పసుపు రకం రూ.80 మధ్య ఉండగా, ఎర్రగా ఉండే టమాట కిలో రూ.90కి విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా టమాటా ధరలు పెరుగుతున్నాయి. మే 1 నుండి మే 10 వరకు స్టేపుల్స్ రిటైల్ ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. మే 10వ తేదీన టమాటా కిలో రూ.60 నుంచి రూ.70 పలుకగా, ప్రీమియం నాణ్యమైన ఉత్పత్తులకు ఏపీఎంసీలో సగటు కొనుగోలు ధర రూ.45గా ఉంది.  ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Thalapathy Vijay Grand Convoy: సీఎం విజయ్ కాన్వాయ్ చూస్తేమతిపోవాల్సిందే | Asianet News Telugu
స్పీచ్ అదరగొట్టిన తలపతి | Thalapathy Vijay Swearing-in Ceremony | Asianet News Telugu