భ‌గ్గుమంటున్న టమాటా ధరలు: ఇప్ప‌టినుంచి టమాటాలు లేకుండానే మెక్‌డొనాల్డ్స్ బ‌ర్గ‌ర్లు !

By Mahesh Rajamoni  |  First Published Jul 7, 2023, 11:25 PM IST

Tomato prices soar: దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో టమాటా ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. టమాటా కిలో రూ.180కి చేరుకుంది. ప‌లు ప్రాంతాల్లో అయితే కేజీ టమాటా ధ‌ర రెండు వంద‌లు దాటింది. ఈ క్ర‌మంలోనే మెక్‌డొనాల్డ్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి నుంచి త‌మ బ‌ర్గ‌ర్ ల‌లో టమాటాలు ఉండ‌వ‌నీ, ప్ర‌స్తుతం పెరుగుతున్న టమాటా ధ‌ర‌లు, స‌ర‌ఫ‌రా లోటు నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది.
 


McDonald's drops tomatoes from burgers: చికెన్ స్లాబ్ల కింద సన్నని టమాటా ముక్కలు లేకుండా మెక్‌డొనాల్డ్స్ బర్గర్ ను ఊహించడం కష్టం. అయితే, మెక్‌డొనాల్డ్స్ బ‌ర్గ‌ర్ ప్రియులు ఇప్పుడు టమాటా లేని బర్గర్లు, శాండ్విచ్ ల‌ను తినాల్సిందే. ఎందుకంటే టమాటా స‌ర‌ఫ‌రా లోటు, పెరుగుతున్న ధ‌ర‌ల మ‌ధ్య టమాటాను త‌మ బ‌ర్గ‌ర్ మెనూ నుంచి తీసివేస్తున్నామ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించి వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది.

దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో టమాటా ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. టమాటా కిలో రూ.180కి చేరుకుంది. ప‌లు ప్రాంతాల్లో అయితే కేజీ టమాటా ధ‌ర రెండు వంద‌లు దాటింది. ఈ క్ర‌మంలోనే మెక్‌డొనాల్డ్స్  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి నుంచి త‌మ బ‌ర్గ‌ర్ ల‌లో టమాటాలు ఉండ‌వ‌నీ, ప్ర‌స్తుతం పెరుగుతున్న టమాటా ధ‌ర‌లు, స‌ర‌ఫ‌రా లోటు నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. జాతీయ రాజధానిలోని ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ ఉత్తర-తూర్పు శాఖలు తాత్కాలిక కాలానుగుణ సమస్య కారణంగా టమాటాలు లేకుండా వంటకాలను అందించే చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. సీజనల్ సమస్యల కారణంగా మెనూ ఐటమ్స్ లో టమాటాలు వుండ‌వ‌ని ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ ప్రతినిధి శుక్రవారం ప్రచురించిన ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు.

🚨Mcdonalds,Delhi put up this notice!

Even Mcdonalds cannot afford tomatoes now!😂😂 pic.twitter.com/cn1LkoQruf

— Aditya Shah (@AdityaD_Shah)

Latest Videos

టమాటో ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి.. ?

టమాటో ధరలు ఆకాశాన్నంటడానికి ప్రతికూల వాతావరణమే కారణమని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని చాలా ప్రాంతాలను పట్టిపీడించిన వడగాలులు చాలా ప్రాంతాల్లో టమాటో పంట ఎదుగుదలకు అంతరాయం కలిగించాయి, ఫలితంగా పంట దిగుబడి తగ్గింది. ఇదే స‌మ‌యంలో దేశవ్యాప్తంగా బలహీనమైన సరఫరా గొలుసును భారీ వర్షాలు మ‌రింత‌గా దెబ్బ‌కొట్టాయి. ఇది ట‌మాటో ఉత్ప‌త్తి పరిస్థితిని మరింత దిగజార్చింది. టమాటో త‌క్కువ జీవిత కాలం, నిల్వలు అయిపోతుండటంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఫలితంగా కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రధాన ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి.

click me!