దడ పుట్టిస్తున్న టమాటా, ఉల్లి ధరలు.. కేంద్రం కీలక ప్రకటన.. నెలలోపు గుడ్ న్యూస్..

By AN TeluguFirst Published Nov 27, 2021, 11:22 AM IST
Highlights

అకాల వర్షాల కారనంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాటా ధరలు పెరిగాయని కేంద్రం పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. నిరుడు ఇదే సమయానికి 70.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, అయితు నిరుడుతో పోల్చితే టమాటా దిగుబడి తగ్గిందని వెల్లడించింది. 

న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి ధరల మీద కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. డిసెంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాటా సగటు ధర రూ. 67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం Tomato prices పెరిగిందని తెలిపింది. 

అకాల వర్షాల కారనంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాటా ధరలు పెరిగాయని పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. నిరుడు ఇదే సమయానికి 70.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, అయితు నిరుడుతో పోల్చితే టమాటా దిగుబడి తగ్గిందని వెల్లడించింది. 

ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ onionలు చేరుకుంటున్నాయని, సెప్టెంబర్ లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్సాల కారణంగా టమాటా పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైందని తెలిపింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కురిసిన heavy rains కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడిందని పేర్కొంది.

దేశవ్యాప్తంగా డిసెంబర్ 25 నాటికి సగటు ఉల్లిపాయ ధర రూ.39 ఉంటుందని, గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లిపాయ ధర తగ్గిందని తెలిపింది. 2019, 2020 కంటే ఉల్లిపాయ ధర ప్రస్తుత తక్కువేనని పేర్కొంది. ఉల్లిపాయ ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేశామని వెల్లడించింది. 

కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. Buffer stock నుంచి ఉల్లిపాయని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయని చెప్పింది. ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈ శాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రం అందించింది.

సామాన్యుడి పై వంటింటి భారం.. ఆకాశాన్నంటుతున్న టమాటో ధరలు..

ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ.164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు పేర్కొంది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. 

ఇదిలా ఉండగా, నవంబర్ 23 నాటి లెక్కల ప్రకారం...చెన్నైలో టొమాటో కిలో ధర రూ.160కి విక్రయిస్తున్నారు. వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పంటలు నష్టపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. బెంగళూరులో టమాటా ధర కిలోకి రూ.110, ముంబైలో టమాటా కిలోకి రూ.80 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ టమాటా ధర కిలోకి రూ.60 నుంచి 90కి చేరింది. టమాటాతో పాటు ఉల్లి ధరలు కూడా భారీగా పెరగడంతో ఢిల్లీ-ముంబైలలో కిలో ఉల్లిని రూ.60కి విక్రయిస్తున్నారు. 

ఒక నివేదిక ప్రకారం, తక్కువ దిగుబడి అధిక డిమాండ్ ఇంకా రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా టమాటో ధరలు నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయని కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. యాప్ ఆధారిత గ్రోసరీ స్టార్టప్‌లు కూడా టొమాటోలను కిలోకి రూ.120 చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక ప్రాంతాలలో వర్షాల కారణంగా టమోటాల ధరలు ప్రభావితమయ్యాయి. పంటలు దెబ్బతినడంతో గతంలో 27 కిలోల టమాటను పొలం నుంచి రూ.500కు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.3వేలకు చేరుకుంది. టమాటా ధరలు గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయికి పెరగలేదు.

click me!