దారుణం.. సరదా కోసం మలద్వారం గుండా గాలిని శరీరంలోకి పంపి.. చంపేశారు...!

By AN TeluguFirst Published Nov 27, 2021, 8:44 AM IST
Highlights

పశ్చిమ బంగాల్ లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 16న నైట్ డ్యూటీ చేయడానికి 
మిల్లుకు వెళ్లాడు. రెహమత్ ని తోటి వర్కర్లు కొంతసేపు ఆటపట్టించారు. అది కాస్తా పశుత్వానికి దారి తీసింది. టీజింగ్ చేయడం, ర్యాగింగ్ చేయడంతో ఆగకుండా.. ఊహించడానికి కూడా వీలుకాని చర్యకు దిగారు. సరదా కోసం.. దారుణంగా ఎయిర్ పంపుతో అతని మలద్వారంలోకి బలవంతంగా గాలిని పంపారు. 

కోల్ కతా : ‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం..’ అని కొన్ని సంఘటనలు ఒకరికి సరదా అయితే, మరొకరికి ప్రాణాలకు ప్రమాదంగా పరిణమిస్తుంటాయి. జాతివైరంతో చంపుకునే జంతువుల కంటే హీనమైన సంఘటనలు మనుషుల్లో జరుగుతుంటాయి. అలాంటి ఓ అత్యంత హేయమైన, పాశవికమైన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. 

సరదా కోసం కొంతమంది విపరీతబుద్దితో ప్రవర్తిస్తూ.. ఎదుటివారి ప్రాణాలు తీసి రాక్షస ఆనందం పొందుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి West Bengal లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాక్షస బుద్ది కలిగిన కొందరు ఓ వ్యక్తి  Bodyలోకి బలవంతంగా Air నింపుతూ మరణించేలా చేశారు. దారుణమైన ఈ ఘటన వివరాల్లోకి వెడితే...

పశ్చిమ బంగాల్ లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 16న Night duty చేయడానికి 
Rahmat Ali మిల్లుకు వెళ్లాడు. రెహమత్ ని తోటి వర్కర్లు కొంతసేపు ఆటపట్టించారు. అది కాస్తా పశుత్వానికి దారి తీసింది. టీజింగ్ చేయడం, ర్యాగింగ్ చేయడంతో ఆగకుండా.. ఊహించడానికి కూడా వీలుకాని చర్యకు దిగారు. సరదా కోసం.. దారుణంగా ఎయిర్ పంపుతో అతని మలద్వారంలోకి బలవంతంగా గాలిని పంపారు. 

అప్పటివరకు వారి చిత్రహింసలను తట్టుకున్ననిస్సహాయుడు అయిన రెహమత్ తనను వదిలిపెట్టమని ఎంత ప్రాధేయపడ్డా విడువకుండా వారు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనతో, వారి పాశవిక చర్యలతో రెహమత్ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ తరువాత అతని Health పూర్తిగా క్షీణించడంతో హుగ్లీలోని governament hospitalకి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Air pump ఒత్తిడి వల్ల అతని శరీరంలోని Liver పూర్తిగా పాడైపోవడంతో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యంగా ఉండి, కుటుంబానికి అండాదండగా ఉన్న రెహమత్ చనిపోవడానికి, అతని మీద ఇంత పాశవికంగా, అనైతికంగా ప్రవర్తించడానికి, చివరికి అతను చనిపోవడానికి కారణం.. అతనితో పాటు మిల్లులో పనిచేసే.. షాజదా ఖాన్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని రెహమాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాజాద్ జూట్ మిల్లును శుభ్రం చేసే ఎయిర్ పంప్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. 

26/11 Mumbai Attacks: మారణకాండకు 13ఏళ్లు.. దక్కని న్యాయం.. పాకిస్తాన్ కుట్రే అని తేల్చే ఆధారాలివే

అయితే రెహమత్ మృతికి బాధ్యత వహిస్తూ.. నష్టపరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటివరకు యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

click me!