టోల్ ట్యాక్స్ కట్టమన్నందుకు: ఉద్యోగిని 6 కిలోమీటర్లు కారుపై ఈడ్చుకెళ్లాడు

By Siva KodatiFirst Published Apr 14, 2019, 12:32 PM IST
Highlights

టోల్‌ ట్యాక్స్ కట్టాలని అడిగిన టోల్‌ప్లాజా ఉద్యోగి పట్ల ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. 

టోల్‌ ట్యాక్స్ కట్టాలని అడిగిన టోల్‌ప్లాజా ఉద్యోగి పట్ల ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లోని ఓ టోల్‌ప్లాజా వద్దకు ఇన్నోవాలో వచ్చిన ఓ వ్యక్తి టోల్ గేట్‌ను దాటి కారును ముందుకు పోనిచ్చాడు.

అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి వచ్చి కారును ఆపమని కోరగా అతనిని ఢీకొట్టాడు. దీంతో అతడు బోనెట్‌పై పడి దానికి వేలాడుతూనే ఉండిపోయాడు. అతను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కారును పరుగులు పెట్టించాడు.

ఆరు కిలోమీటర్లు ప్రయాణించక సదరు ఉద్యోగి తప్పించుకున్నాడు. అంతకు ముందు ‘‘ నా కారును పోలీసులు కూడా అడ్డుకోరు.. నువ్వెలా ఆపుతావు అంటూ ఆ కారులోని వ్యక్తి తనతో అన్నట్లు టోల్‌ప్లాజా ఉద్యోగి తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

click me!