Today's Top Stories: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..  మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక.. చంద్రబాబుపై మరో ఛార్జిషీట్..

By Rajesh Karampoori  |  First Published Feb 9, 2024, 7:27 AM IST

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్ తో మాజీ మంత్రి దంపతులు..,  ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం,  తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేల్లో సంచలన విషయాలు, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ సంచలన నివేదిక, చంద్రబాబుకు బిగ్ షాక్‌.. ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్.., మోడీ కులంపై వ్యాఖ్యలు : రాహుల్‌ క్షమాపణలు చెప్పాలన్న జాతీయ బీసీ కమీషన్,హిందువులు అయోధ్య,కాశీ, మధురలను కోరుకుంటున్నారు: సీఎం యోగి,  పాక్ ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆసీస్.. ఇక భారత్‌తో టైటిల్ పోరు.. వంటి వార్తల సమాహారం. 


Today's Top Stories:   

 ఓటర్ల తుది జాబితా విడుదల..  

Latest Videos

Telangana Final Voters List : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ నిష్పత్తిలో మెరుగుదల చూపిస్తూ ప్రత్యేక సవరణ తర్వాత ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. ఈ  తుది ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గురువారం విడుదల చేశారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం..తెలంగాణలో మొత్తం 3,30,37,113 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,64,47,132 మంది పురుషులు, 1,65,87,244 మంది మహిళలు, 2,737 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. 15,378 సర్వీస్ ఎలక్టర్లు,  3,399 ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు.  

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్ తో మాజీ మంత్రి దంపతులు.. 

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా భారీ షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కారు దిగి.. హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి గురువారం నాడు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిశారు. కాగా, గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కానీ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని దంపతులు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి సునీతకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వాలని కోరగా, ఆమెకు నామినేషన్‌ వేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం 

CM Revanth Reddy: రాష్ట్రంలో జరుగుతోన్న ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిలుపుదల చేసేందుకు సీఎం రేవంత్ .. 48 గంటల గడువు విధించారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (వీఅండ్‌ఈ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బృందాలను రంగంలోకి దించి ఇసుక వ్యాపారంలో అక్రమాలను అరికట్టనున్నారు. ఇసుక ధరలను తగ్గించడంతో పాటు హోర్డింగ్‌, బ్లాక్‌మార్కెటింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువస్తుందని చెప్పారు. 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ సంచలన నివేదిక  

Medigadda:  కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఒకటి. అయితే.. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రేవంత్ సర్కార్  నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌​లో 16 నుంచి 21వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ తెలిపింది. అంతేగాక.. 6,7,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా ఇతర సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ కమిటీ  వెల్లడించింది.

తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేల్లో సంచలన విషయాలు

Lok Sabha Polls: లోక్ సభ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయా? రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటుందా? అనే విషయంపై టైమ్స్ నౌ, మ్యాట్రిజ్ న్యూస్ కలిసి ఓ సర్వే చేపట్టింది. కాంగ్రెస్ తన విజయయాత్రను  కొనసాగిస్తుందని తెలిపింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇందులో గరిష్టంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం రెండు సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే పేర్కొంది. కాగా, బీజేపీ మాత్రం తన ట్యాలీని పెంచుకోనుంది. గతంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి ఐదు సీట్లను గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.
 
 TS Assembly: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 9న గవర్నర్ ప్రసంగంపై చర్చ, 10న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 12, 13 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. 

చంద్రబాబుకు బిగ్ షాక్‌.. ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్..

Chandrababu: ఎన్నికలకు సన్నద్ధమవుతున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబుకు తాజాగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ప్రధాని నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను ఏ2గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో  సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది.

కోడికత్తి కేసు:నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 

కోడికత్తి కేసు నిందితుడు  శ్రీనివాస్  కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది.కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావుకు  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో  బెయిల్ మంజూరు చేసింది.  కోడికత్తి కేసులో  బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్  ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు.  ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ ఏడాది జనవరి  24న రిజర్వ్ చేసింది.  అయితే  ఇవాళ ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది.  

పొత్తులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
  
YS Jagan: వైసీపీ కీలక నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నది, అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడని ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని, తీరా.. ఇక్కడ బీజేపీనే పొత్తు కోసం తమ వెంట పడుతున్నట్టు బిల్డప్ ఇస్తారని ఫైర్ అయ్యారు. టీడీపీ బలహీనంగా ఉన్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు తీవ్రంగా విమర్శలు చేసిన బీజేపీతో ఇప్పుడు చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధం అయ్యారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్లుతారని, ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపైనా సజ్జల కామెంట్లు చేశారు. వైఎస్ షర్మిల చేసే ఆరోపణలు సత్యదూరం అని అన్నారు.  

మోడీ కులంపై వ్యాఖ్యలు : రాహుల్‌ క్షమాపణలు చెప్పాలన్న జాతీయ బీసీ కమీషన్

ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ న్యాయ యాత్రలో భాగంగా ఒడిషాలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. మోడీ కులం గురించి అబద్ధం చెప్పారని, ఆయన పుట్టుకతో ఓబీసీ వర్గానికి చెందని వ్యక్తి కాదన్నారు. దీనిపై జాతీయ బీసీ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ సామాజిక వర్గాలకు రాహుల్ గాంధీ తక్షణం క్షమాపణలు చెప్పాలని సూచించింది. ఈ మేరకు కమీషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

హిందువులు అయోధ్య,కాశీ, మధురలను కోరుకుంటున్నారు: సీఎం యోగి  

హిందూ  సమాజం ప్రస్తుతం అయోధ్య, కాశీ మధురల గురించి అడుగుతున్నారని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  చెప్పారు. మహాభారతంలో కృష్ణుడు  ఐదు గ్రామాలకు  గురించి అడిగినట్టుగా  పురాణాల్లో చెప్పిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. బుధవారంనాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య దీపోత్సవం జాతీయ  సంబరంగా నిర్వహించడం తమ ప్రభుత్వం అదృష్టంగా భావిస్తున్నట్టుగా ఆయన  చెప్పారు. గత ప్రభుత్వాల హయంలో  అయోధ్యలో  కర్ఫ్యూలు కొనసాగిన విషయాన్ని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ప్రణాళికా బద్దంగా  అయోధ్యను నిర్లక్ష్యం చేశారన్నారు.  ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు.   ఈ రకమైన పరిస్థితిని తాను ఎక్కడా చూడలేదన్నారు.

 పాక్ ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆసీస్.. ఇక భారత్‌తో టైటిల్ పోరు..

Under 19 World Cup: అండర్‌-19 ప్రపంచకప్‌ (U19 World cup) ఫైనల్‌లో భారత్‌ Vs పాక్‌ ఉత్కంఠ పోరు చూడాలనుకున్న క్రికెట్‌ లవర్స్  కల చెదిరింది. బెనోని వేదికగా పాకిస్థాన్‌తో (Pakistan) జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ పోరులో ఆస్ట్రేలియా (Australia) ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు అండర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లోకి ప్రవేశించింది. 2018 తర్వాత కంగారూ టీమ్‌కి టోర్నీ ఫైనల్‌ టిక్కెట్‌ లభించింది. ఇప్పుడు ఆదివారం జరగబోయే అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరుగనున్నది. 

click me!