Today's Top Stories: గ్రూప్‌-4 రిజల్ట్స్.. సీఎం రేవంత్ కి ఎదురుదెబ్బ.. పీవీకి భారతరత్న.. ప్రధానితో జగన్ భేటీ..

By Rajesh Karampoori  |  First Published Feb 10, 2024, 7:36 AM IST

Today's Top Stories: శుభోదయం.. తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాల విడుదల , అగ్గిపెట్టె ముచ్చట ఇక బంద్ చేయండి, నిరుద్యోగుల‌కు సీఎం రేవంత్ తీపి కబురు., సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు, ఎట్టకేలకు కోడికత్తి శ్రీను విడుదల, చిరంజీవికి గవర్నర్ తమిళిసై సత్కారం , మాజీ ప్రధానులు పీ.వీ. నరసింహారావు, చరణ్ సింగ్ సహా స్వామినాథన్ లకు భారతరత్న, ప్రపంచంలో అత్యధిక ఓట‌ర్లు గ‌ల దేశంగా భార‌త్‌.. ఓట‌ర్ల సంఖ్య ఎంతంటే?, పార్లమెంటు క్యాంటీన్‌లో తోటి ఎంపీలతో ప్రధాని మోడీ లంచ్, ఎట్టకేలకు కోడికత్తి శ్రీను విడుదల.., ప్రధాని మోడీతో సీఎం కీలక భేటీ  వంటి వార్తల సమాహారం. 


Today's Top Stories:   

తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాల విడుదల 

Latest Videos

TSPSC Group 4 Results 2024: లక్షలాది మంది నిరుద్యోగులుయ ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త. తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC Group 4 Results) ఫిబ్రవరి 9న విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను టీఎస్పీస్సీ వెల్లడించింది. మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో  మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని కమిషన్ సూచించింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.  

'అగ్గిపెట్టె ముచ్చట ఇక బంద్ చేయండి"

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టె దొరకదంటూ సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అగ్గిపెట్టె ముచ్చ‌ట మాట్లాడ‌టం బంద్ చేయాలని సూచించారు. పదే పదే త‌మ‌ను కించ‌ప‌రిచి, రాజ‌కీయంగా విమ‌ర్శిస్తామనుకుంటే అది మీ రాజ‌కీయ విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానని తెలిపారు.

నిరుద్యోగుల‌కు సీఎం రేవంత్ తీపి కబురు..

Group 1: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరుద్యోగులకు శుభవార్తలు వినిపించారు.  త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌(Group 1 Notification)ను ఇస్తామని శుక్రవారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. అయితే, గ్రూప్‌- 1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. మరో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.

 సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ..

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ఆయనకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2015లో ఓటుకు నోటు కేసులో క్రిమినల్‌ విచారణను తెలంగాణ నుంచి మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి తదితరులకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది . ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మోహతా బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్‌ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 

ఎట్టకేలకు కోడికత్తి శ్రీను విడుదల..

Kodi kathi Srinivas: ఎట్టకేలకు కోడికత్తి కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను విడుదలయ్యాడు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్ పై కోడికత్తి తో దాడి చేసిన శ్రీను ఐదేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.  దీంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాడు.ఈ క్రమంలో శ్రీనుకు ఎస్సీ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ చిత్ర పటం పట్టుకున్న కోడికత్తి శ్రీను చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. సీఎం జగన్ పై కోడికత్తి తో దాడి చేసిన శ్రీను ఐదేళ్ల పాటు జైలులోనే ఉన్నారు. తాజాగా ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

ప్రధాని మోడీతో సీఎం కీలక భేటీ 

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు.ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలపై  కూడ ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  వై.ఎస్. జగన్ చర్చించారని సమాచారం.విభజన చట్టంలోని హామీల అమలుపై కూడ చర్చించారని తెలుస్తుంది. విశాఖపట్టణంలోని  ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని కూడ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిపైనే చర్చించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  సుమారు గంటకు పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  సీఎం జగన్ చర్చించారు.

పార్లమెంటు క్యాంటీన్‌లో తోటి ఎంపీలతో ప్రధాని మోడీ లంచ్
 
Parliament Canteen: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం లభించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షఎంపీలు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, స్కాములపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు క్యాంటీన్‌లో లంచ్ చేశారు. తోటి ఎంపీలతో కలిసి ఆయన భోజనం చేశారు. ఎనిమిది మంది ఎంపీలతో ఆయన భోజనం చేసినట్టు సమాచారం.

ప్రపంచంలో అత్యధిక ఓట‌ర్లు గ‌ల దేశంగా భార‌త్‌.. 


Lok Sabha election 2024: ప్రజాస్వామ్య భారతదేశంలో అతిపెద్ద పండుగ త్వరలో జరుగబోతుందనీ, ఈ సారి మహా పండుగకు 97 కోట్ల మంది ప్రజలు ఓట్లు వేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడానికి అర్హులు అవుతారని, వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని భారత ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది కొత్తగా రెండు కోట్ల మందికి పైగా యువత ఓటర్లుగా మారారనీ,  18 నుంచి 19 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు రెండు కోట్ల మందికి పైగా జాబితాలో చేరారని ఎన్నికల సంఘం తెలిపింది. గత లోక్‌సభ ఎన్నికల (2019)తో పోలిస్తే ఈసారి ఆరు శాతం ఓటర్లు పెరిగారని ఎన్నికల సంఘం తెలిపింది.

మాజీ ప్రధానులు పీ.వీ. నరసింహారావు, చరణ్ సింగ్ సహా స్వామినాథన్ లకు భారతరత్న


మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహారావుతో సహా వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్,  మాజీ ప్రధాన మంత్రి చరణ్ సింగ్ కు కూడ  భారత రత్నను ప్రకటించిందికేంద్ర ప్రభుత్వం.ఒకే ఏడాది ఐదుగురికి  భారత రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  పీ.వీ. నరసింహారావును భారత రత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహారావును భారత రత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.  విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహరావు భారత దేశానికి వివిధ హోదాల్లోసేవలందించిన విషయాన్ని మోడీ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా  పనిచేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.

చిరంజీవికి గవర్నర్ తమిళిసై సత్కారం 

దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ Padma Vibhushan మెగాస్టార్ చిరంజీవి Chiranjeeviని వరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఈ అత్యున్నత అవార్డును ప్రదానం చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ సభ్యులు చిరును సత్కరించారు. గ్రాండ్ పార్టీ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. పలు వేదికలపై చిరుకు ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. 

click me!