
ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పెంపునకు వ్యతిరేకంగా నేడు దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ మెగా ర్యాలీ నిర్వహించనుంది. ఈ నిరసనలకు కాంగ్రెస్ ‘మెహంగై పర్ హల్లా బోల్’ అని పేరు పెట్టింది. ఇప్పటికే ఈ ర్యాలీ కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. పోలీస్ స్టేషన్ లోనే నిప్పంటించుకున్న యువతి.. ఎందుకంటే ?
దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొనే ఈ ర్యాలీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నాయకులు హాజరవనున్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
సెప్టెంబరు 7వ తేదీన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రారంభించనున్న ‘భారత్ జోడో యాత్ర’ కంటే కొంచెం ముందగానే ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగనుంది. 3,500 కిలోమీటర్ల పాటు ఈ సాగే ఈ యాత్రలో రాహుల్ గాంధీ ముఖ్య నాయకుడిగా పాల్గొంటారు. ఈ యాత్ర సందర్భంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యలను ఆయన టార్గెట్ చేయున్నారు. అలాగే మత సామరస్యాన్నిపెంపొందించేందుకు ఈ యాత్ర తోడ్పడుతుందని కాంగ్రెస్ పేర్కొంది.
భారత్ జోడో యాత్ర అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టనున్న అతి పెద్ద సామూహిక సంప్రదింపు కార్యక్రమం. ఈ యాత్రలో పార్టీ నాయకులందరూ అట్టడుగు స్థాయిలోని సామాన్య ప్రజలకు చేరువ అవుతారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం వైద్య చికిత్స కోసం దేశం బయట ఉన్నారు. కాబట్టి వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
ధరల పెరుగుదల, నిరుద్యోగంపై అధికార ఎన్డీఏపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ఇవి సామాన్య ప్రజల సమస్యలని, వీటిని అన్ని వేదికలపై చర్చించాలని కోరుకుంటోంది. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. నిత్యావసర వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపుతో పాటు మిగితా సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతోంది.