కోవిన్ డేటా లీక్, ఆధార్ సహా ఇతర సమాచారం టెలిగ్రామ్ లో :టీఎంసీ నేత సాకేత్ గోఖలే

Published : Jun 12, 2023, 02:44 PM IST
  కోవిన్ డేటా లీక్, ఆధార్ సహా  ఇతర  సమాచారం టెలిగ్రామ్ లో :టీఎంసీ నేత సాకేత్  గోఖలే

సారాంశం

కోవిన్ పోర్టల్  నుండి డేటా లీక్ అయిందని టీఎంసీ ఆరోపించింది. ప్రముఖుల సమాచారం కూడ ఇందులో ఉందని  ఆ పార్టీ తెలిపింది.  టీఎంసీ నేత సాకేత్ గోఖలే  ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న  వారి  వివరాలు  లీకయ్యాయని టీఎంసీ ఆరోపించింది.  కోవిన్ పోర్టల్ లోని  కీలకమైన  సమాచారం   టెలిగ్రామ్ లో  ప్రత్యక్షమైందని ఆ పార్టీ  ప్రకటించింది.  ఆధార్,  పాస్ పోర్టు, ఓటర్ ఐడీ కార్డు, పుట్టినతేదీ  వంటి సమాచారం  లీకైందని  పేర్కొన్నారు.  ప్రముఖుల  సమాచారం  టెలిగ్రామ్ లో  ప్రత్యక్షమైందని    టీఎంసీ  నేత  సాకేత్ గోఖలే  ట్విట్టర్ వేదికగా  ప్రకటించారు.  కొన్ని స్క్రీన్ షాట్లను  ట్వీట్ లో   పోస్టు చేశారు. 

 

 మోడీ  ప్రభుత్వం  పెద్ద డేటా లీక్ జరిగిందని   టీఎంసీ నేత  ఆరోపించారు.  కోవిన్  యాప్ లో  ఇచ్చిన ఫోన్ నెంబర్ ను   టెలిగ్రామ్  లో నమోదు  చేసిన సమయంలో  ఈ వివరాలు  బయటకు వస్తున్నాయని  చెబుతున్నారు.  కోవిన్ పోర్టల్  హ్యాక్ అయిందనే  ప్రచారం కూడ  ప్రారంభమైంది.  అయితే  ఈ ప్రచారాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు  ఖండించారు. 

కరోనా  వ్యాక్సిన్ వేసుకొనే  ప్రజల కోసం  కేంద్ర ప్రభుత్వం  కోవిన్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  ఏ రోజున వ్యాక్సిన్  ను  తీసుకొనేందుకు  స్లాట్ ను  బుక్  చేసుకొనే వెసులుబాటును కల్పించింది.  అయితే  ఈ పార్టల్ లో నమోదు  చేసిన  సమాచారం ఇప్పుడు  టెలిగ్రామ్ యాప్ లో  వెలుగు చూడడం కలకలం రేపుతుంది.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?