
ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్ మారింది. ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రజల దృష్టిని ఆకర్షించడంలో సోషల్ మీడియా వేదికగా సాగే ప్రచారం కూడా కీలక భూమిక పోషిస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో చేసే కొన్ని తప్పిదాలు తీవ్ర విమర్శలకు దారితీస్తుంటాయి. దీంతో వ్యతిరేకించే పార్టీ వారికి విమర్శన అస్త్రాలుగా మారుతుంటాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేష్ కరియప్ప కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ.. ఈరోజు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని గ్వారిఘాట్‌లో నర్మదా నది పూజకు హాజరయ్యారు.
ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనుండగా.. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రియాంక ప్రారంభించారు. అయితే ప్రియాంక జబల్‌పూర్ పర్యటన సందర్భంగా నాగేష్ కరియప్ప ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. అయితే ఆ పోస్టులో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్న వేదికపై హనుమంతుడి గద ఉంచినట్టుగా ప్రస్తావించిన సమయంలో.. గద బదులుగా గాడిద అనే అర్థం వచ్చేలా పదాన్ని (गधे) ఉంచారు. దీంతో అి పూర్తిగా నెగిటివ్ అర్థం ధ్వనించేలా మారింది.
ఈ నేపథ్యంలోనే పలువురు నాగేష్ కురియప్పను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా మంది ట్వీట్‌లో తప్పు దొర్లిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్.. హిందీ క్లాసులను వినకుండా ఎగగొడితే ఇలాగే జరుగుతుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. నాగేష్ కురియప్ప ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. దీనిపై చాలా మంది విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుండగా.. కొందరు మాత్రం హిందీని రుద్దడాన్ని ఆపాలని కామెంట్ చేశారు.