
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి వారం రోజులు అవుతున్నది. ప్రారంభ కార్యక్రమం జరిగిన వారం దాటిందో లేదో వర్షాల కారణంగా ఆ రోడ్డు ఓ చోట కొట్టుకుపోయింది. సుమారు అడుగున్నర లోతుతో అక్కడ రోడ్డు కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలనే సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే కు ప్రధాని నరేంద్ర మోడీ 2020 ఫిబ్రవరి 29న శంకుస్థాపన చేశారు. 28 నెలల్లో సుమారు 14వేలకు పైగా కోట్లతో 296 కిలోమీటర్ల పొడుగు రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ ఏడాది జులై 16న ప్రధాని ఈ రోడ్డును ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే మొత్తం ఏడు జిల్లాలు చిత్రకూట్, బండా, మహోబా, హర్మిర్‌పుర్, జలౌన్, ఔరాయ, ఎట్టావాల గుండా వెళ్లుతుంది. చిత్రకూట్‌లో ప్రారంభమై ఎట్టావా జిల్లాలో కుంద్రైల్‌లో ముగుస్తుంది. అక్కడ ఈ రోడ్డు ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలుస్తుంది.
రోడ్డు కోతకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎక్స్‌ప్రెస్ వేపై కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోయిందని తెలిపారు. ఇది బీజేపీ ప్రభుత్వం చేసే సగం సగం పనులకు నిదర్శనం అని ఆరోపించారు. ఈ రోడ్డును పెద్ద మనుషులు (ప్రధాని నరేంద్ర మోడీ!) ప్రారంభించారని పేర్కొన్నారు. ఇప్పుడు వారం రోజులకే ఎక్స్‌ప్రరెస్ వే నిర్మాణంలో చోటుచేసుకున్న పెద్ద అవినీతి బాగోతం బయటపడినట్టయింది. ఇంకా అదృష్టం ఈ రోడ్డుపై రన్ వే నిర్మించలేదని విమర్శించారు.
సమాజ్ వాదీ పార్టీని ఆప్ పార్టీ కూడా ఫాలో అయింది. ఎక్స్‌ప్రెస్ వే కు చెందిన వీడియో షేర్ చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
కాగా, యూపీ ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రియల్ డివలప్‌మెంట్ అథారిటీ దుర్గేయ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, రోడ్డు ఎక్కడ కూడా నీట మునిగిపోలేదని, అయితే, ఓ చోట మాత్రం వరద నీరు కారణంగా దారి మునిగిపోయిందని తెలిపారు. అయితే, రిపేర్ టీమ్ స్పాట్‌కు వెళ్లిందని వివరించారు. ఆ దారిని రెనోవేట్ చేస్తుండగా... కొందరు వీడియో తీశారని, ప్రస్తుతం ఆ రోడ్డు బాగు చేశారని తెలిపారు.
అయితే, రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోవడంతో సేలంపూర్‌లోని ఛిరియా ఏరియాలో రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ ఢీకొన్టట్టు తెలిసింది.pm modiji, uttarpradesh, yogi adityanath, viral video, bundelkhand expressway, modi inauguration, samajwadi party, akhilesh yadav, rains