ముంబై వర్షాలు: ఆనకట్టకు గండి.. 23 మంది గల్లంతు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

Siva Kodati |  
Published : Jul 03, 2019, 08:17 AM ISTUpdated : Jul 03, 2019, 08:18 AM IST
ముంబై వర్షాలు: ఆనకట్టకు గండి.. 23 మంది గల్లంతు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

సారాంశం

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వర్షాలు వదలడం లేదు. దాదాపు ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం జలసంద్రమయ్యింది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వర్షాలు వదలడం లేదు. దాదాపు ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం జలసంద్రమయ్యింది. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు కూలి ఇప్పటికే మహారాష్ట్రలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో రత్నగిరిలోని తివారి ఆనకట్టకు పడి సమీపంలోని గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ  ఘటనలో ఇద్దరు మరణించగా... 23 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. వరద ఉద్ధృతికి 12 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu