ఎంత ఆదర్శం... డాక్టర్ ని పెళ్లాడిన కలెక్టర్..కట్నంగా ఏం తీసుకున్నాడంటే...

By telugu news teamFirst Published Mar 2, 2020, 10:18 AM IST
Highlights

రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం లో నిలిచారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి జిల్లా సబ్ కలెక్టర్ గా వ్యవహరిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్రామ అభివృద్ధి బృందాలను ఏర్పాటు చేసి పలు రకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నారు.

కట్నంగా ఎవరైనా ఏం తీసుకుంటారు..? డబ్బు, బంగారం, ఇళ్లు, కారు లాంటివి తీసుకుంటారు. కొందరు ఆదర్శవంతులైతే.. అసలు కట్నమే తీసుకోకుండా చేసుకుంటారు. అలా కాదంటే.. ఏ మొక్కలు, పుస్తకాలు లాంటివి తీసుకొని ఉంటారు. అయితే... ఈ కలెక్టర్ మాత్రం చాలా భిన్నం. డాక్టర్ ని పెళ్లాడిన ఆయన కట్నంగా.. గ్రామస్తుల ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్ర్ంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఉన్నాయి.

తంజావూరు జిల్లా పేరావూరణి సమీపంలోని వట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసి 2018లో ఐఏఎస్ పరీక్ష రాసి జాతీయస్థాయిలో 101వ స్థానాన్ని సంపాదించాడు. రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం లో నిలిచారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి జిల్లా సబ్ కలెక్టర్ గా వ్యవహరిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్రామ అభివృద్ధి బృందాలను ఏర్పాటు చేసి పలు రకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నారు.

Also Read విచిత్రం... ఒకే కాన్పులో ఆరుగురు జననం.. పుట్టిన కాసేపటికే.....

ఈ నేపథ్యంలో ఆయనకు ఇటీవల ఓ మహిళా డాక్టర్ తో వివాహం నిశ్చయమైంది. గత నెల 26వ తేదీ రెండు కుటుంబాల పెద్దలు, బంధువు, స్నేహితుల సమక్షంలో కృష్ణభారతి- శివగురు ప్రభాకరన్‌ల వివాహం ఘనంగా జరిగింది. అయితే.. ఆమె కుటుంబం నుంచి కట్నంగా ఆయన తీసుకున్న మాట అందరినీ ఆకట్టుకుంటోంది.

తన భార్య డాక్టర్ కాబట్టి.. తమ గ్రామస్థులందరికీ ఉచిత వైద్యం చేయాలని ఆయన కోరారు. ఆయన కోరిక మన్నించిన తర్వాతే వారి పెళ్లి జరిగింది. కాగా... ఈ దంపతుల ఆదర్శ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 

click me!