Supreme Court కీల‌క నిర్ణ‌యం.. మ‌ళ్లీ వర్చువల్‌గా కేసుల విచారణ

By Rajesh K  |  First Published Jan 3, 2022, 2:25 AM IST

Supreme Court :  దేశంలో కరోనావైరస్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (జనవరి 3) నుంచి వర్చువల్ పద్ధతిలో కేసుల విచారణ చేప‌ట్టనున్న‌ట్టు సుప్రీంకోర్టు తెలిపింది. రెండు వారాలపాటు ఈ విధానంలోనే కేసుల విచారణ జరగనుందని , ఆ  త‌రువాత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యాన్ని వెల్లడిస్తామ‌ని తెలిపింది. 
 


Supreme Court : దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. దానికి తోడు క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మ‌రింత విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర‌, రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేశాయి. రాత్రి వేళ‌ల్లో క‌ర్ఫ్యూ ను అమ‌లు చేస్తున్నాయి. 

దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్​ సహా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో   సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  సుప్రీం కోర్టు కార్యకలాపాలను వర్చువల్ పద్ధతిలో విచారణలకు సిద్ధమైంది. సోమవారం (జనవరి 3) నుంచి రెండు వారాల పాటు అన్ని కేసుల విచారణలు ఈ ప‌ద్ద‌తి ద్వారానే  జరుగుతాయని సుప్రీం కోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కరోనా కేసుల పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

Latest Videos

undefined

Read Also: ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. జగన్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు, ఆ జీవోపై స్టే

హైబ్రిడ్​ పద్ధతిలో కోర్టు నిర్వహణకు వీలుగా 2021 అక్టోబర్​ 7న జారీచేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. శీతాకాలం సెలవుల అనంతరం.. సుప్రీం కోర్టు జనవరి 3న తిరిగి తెరుచుకోనుంది.కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో.. గతేడాది మార్చి నుంచి సుప్రీం కోర్టు విచారణ వీడియో కాన్ఫరెన్స్​లోనే జరిగింది. అక్టోబర్​ 7న మళ్లీ భౌతిక విచారణ ప్రారంభమైంది.

Read Also: Omicron ఎఫెక్ట్: బెంగాల్‌లో రేపటి నుండి విద్యా సంస్థల మూసివేత

ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 27,553 కోవిడ్ వైరస్ కేసులు, 284 మరణాలు నమోదయ్యాయి. గత వారం రోజుల క్రితం వేలులోపే కేసులు నమోదవుతుండగా.. తాజాగా 20వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు క‌రోనాకు ఓమిక్రాన్ తోడు కావ‌డంతో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఓమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా.. 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ 23 రాష్ట్రాలకు విస్తరించింది.

Read Also: ఏపీ: కొత్తగా 165 మందికి కరోనా .. 20,74,591కి చేరిన కేసుల సంఖ్య

మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలలో ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో 460, ఢిల్లీలో 351 కేసులు నమోదయ్యాయి.  గుజరాత్‌లో 136, తమిళనాడులో 117, కేరళలో 109, తెలంగాణలో 67, ఏపీలో 17, కర్ణాటకలో 64, హర్యానాలో 63, పశ్చిమ బెంగాల్లో 20, ఒడిశాలో 14, మధ్యప్రదేశ్‌లో 9, యూపీలో 8, ఉత్తరాఖండ్‌లో 8, చండీఘడ్‌, జమ్మూ కశ్మీర్‌లో 3, గోవా, హిమాచల్ ప్రదేశ్, లఢక్, మణిపూర్, పంజాబ్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు న‌మోద‌న‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

click me!