వ్యక్తిని అడవిలోకి ఈడ్చుకెళ్లి.. సగం తిని వదిలేసిన పులి.. అది చూసిన స్నేహితులు పరుగులు..

Published : Dec 26, 2022, 11:49 AM IST
వ్యక్తిని అడవిలోకి ఈడ్చుకెళ్లి.. సగం తిని వదిలేసిన పులి.. అది చూసిన స్నేహితులు పరుగులు..

సారాంశం

ఉత్తరాఖండ్ లోని కార్బట్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఓ పులి వ్యక్తి మీద దాడి చేసింది. అతడిని అడవిలోకి లాక్కెళ్లి.. సగం తిని వదిలేసింది.

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో జరిగిన ఓ ఘటన షాకింగ్ కు గురిచేసింది. కొంతమంది స్నేహితులు కలిసి సరదాగా మద్యం సేవిస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన పులి.. ఆ స్నేహితులలోని ఓ 32 ఏళ్ల వ్యక్తిని ఈడ్చుకు పోయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు మిగతా వారంతా భయాందోళనలతో పరుగులు పెట్టారు. అతడిని అడవిలోకి ఈడ్చుకెళ్లిన పులి సగం తిన్నది. ఈ సగం శరీరాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. శనివారం సాయంత్రం రాంనగర్ అడవిలో ఈ దారుణమైన ఘటన జరిగింది.

ఈ ఘటనలో ఖతారి ఈ గ్రామానికి చెందిన నఫీస్ అనే వ్యక్తి పులి బారిన పడ్డాడు. నఫీస్ స్నేహితులతో కలిసి మందు తాగడానికి శనివారం సాయంత్రం ఊరి బయట ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళారు. కాలువ పక్కన ఉన్న బ్రిడ్జి పక్కన కూర్చుని స్నేహితులంతా కలిసి మందు తాగుతున్నారు. ఇంతలో అక్కడికి ఎక్కడి నుంచో ఒక పులి వచ్చింది. వారు ఆదమరచి ఉండటం గమనించింది.  ఒక్క ఉదుటున నఫీస్ పై దాడి చేసింది. అతడిని నోట కరుచుకుని సమీపంలోని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు స్నేహితులకు… అంతలోనే జరిగిందేమిటో అర్థమై భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

భార్యపై అత్యాచారం.. భర్తకు నగ్న చిత్రాలు పంపి బెదిరింపులు.. అవమానంతో ఆత్మహత్య...

జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు వెంటనే అలర్ట్ అయ్యి  నఫీస్ కోసం బ్రిడ్జి చుట్టుపక్కల గాలించారు. ఆదివారం ఉదయం వారు కూర్చుని మందు తాగిన ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో నఫీస్ సగం మృతదేహం లభించింది. దీంతో పులి అతడిని సగం తిని వదిలేసిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతమంతా కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏరియా అని.. పులులు యదేచ్ఛగా ఇక్కడ సంచరిస్తుంటాయి అని.. తెలిపారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని.. ఈ ప్రాంతాలకు వెళ్లొద్దని  హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?