తల్లితో శారీరక సంబంధం.. స్నేహితుడి గొంతుకోసి, కాలువలో పడేసి దారుణం.. మూడేళ్ల తరువాత వెలుగులోకి...

Published : Mar 30, 2022, 02:04 PM IST
తల్లితో శారీరక సంబంధం.. స్నేహితుడి గొంతుకోసి, కాలువలో పడేసి దారుణం.. మూడేళ్ల తరువాత వెలుగులోకి...

సారాంశం

తన స్నేహితుడే తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆ కొడుకు భరించలేకపోయాడు. తల్లిని ఏమీ అనలేక స్నేహితుడికి కడతేర్చాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు పోలీసులను కన్ఫ్యూజ్ చేశాడు. కానీ చివరికి పట్టుబడ్డాడు. 

మధ్యప్రదేశ్ : మూడేళ్ల క్రితం జరిగిన ఓ యువకుడి murder కేసులో తాజాగా సంచలన విషయాలు బయట పడ్డాయి. friend చేతిలోనే ఆ యువకుడు హత్యకు గురయ్యాడని పోలీసులు బయటపెట్టారు. తన తల్లితో illegal relation పెట్టుకున్నాడని స్నేహితుడిని చంపేశానని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. మూడేళ్ల పాటు పోలీసులను కన్ఫ్యూజ్ చేసి ఎట్టకేలకు దొరికిపోయాడు. madhyapradeshలోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

సాగర్ జిల్లాలోని రహత్ గఢ్ ప్రాంతానికి చెందిన  రామ్ దిన్, Munnalal మంచి స్నేహితులు.  మున్నాలాల్  తరచుగా రామ్ దిన్ ఇంటికి వెళ్ళేవాడు. ఆ క్రమంలో రామ్ దిన్ తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రామ్ దిన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. 2019 సెప్టెంబర్ 5న స్నేహితుడిని ఊరికి రెండు వందల కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి.. గొంతుకోసి చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మున్నాలాల్ స్నేహితుడు అనే కారణంతో రామ్ దిన్ ను కూడా విచారణకు పిలిచారు. అయితే పోలీసులను తప్పుడు సమాచారంతో రామ్ దిన్ మిస్ లీడ్ చేశాడు.

తనకు హత్యకు సంబంధం ఉందనే అనుమానం రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. హత్య జరిగిన రోజు మొబైల్ ఇంటి దగ్గర వదిలేశాడు. మూడేళ్ల పాటు పోలీసులకు అనుమానం రాకుండా తప్పించుకున్నాడు. అయితే మున్నా లాల్ కు రామ్ దిన్ తల్లికి ఎఫైర్ ఉన్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. దీంతో వారు రామ్ దిన్ పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు రామ్ దిన్  తన నేరాన్ని అంగీకరించాడు. 

ఇదిలా ఉండగా,  ప్రేమించిన వ్యక్తి సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా.. కానీ అతడు మాత్రం.. తనను దక్కని ప్రియురాలు చావాలని కోరుకున్నాడు. అందుకే తన friend మరొకరిని వివాహం చేసుకుంటుందని ఆమెను murder చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి.  ఈ క్రమంలో ఆయన ప్లాన్ విఫలమై తానే నిప్పంటించుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్ లో జరిగింది. నడపురం గ్రామంలో రత్నేష్ (41) ఎలక్ట్రీషియన్గా పనిచేసే వాడు. తన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలని  అనుకున్నాడు. కానీ దానికి పెద్దలు ఒప్పుకోలేదు.  ఆమెకు మరొకరితో  వివాహం నిశ్చయమైంది.  ఏప్రిల్ లో ఆమె పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. అయితే ఇది సహించలేని రత్నేష్…  తనకు దక్కని  ప్రేయసి బతికి ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఆమెను హత్య చేయాలని murder plan చేశాడు.  

మంగళవారం  వేకువజామున  రెండు గంటల సమయంలో బాధిత మహిళ ఇంటికి వెళ్ళాడు. సహాయంతో ఆమె ఇంటి రెండో అంతస్తు ఎక్కి బెడ్రూమ్ కు fire అంటించాడు. గమనించిన ఇంటి పక్క వ్యక్తి అందరినీ పిలిచాడు. ఆ ఇంటి వైపు అందరూ పరుగులు పెడుతూ వస్తుండగా నిందితుడు తన ఒంటిపై petrol పోసుకుని నిప్పంటించుకున్నాడు. అందరూ చూస్తుండగానే  మంటల్లో కాలిపోయాడు. ఈ ఘటనలో బాధిత మహిళ ఆమె సోదరుడు గాయాలపాలయ్యారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu