మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు.. మరో మహిళతో ప్రేమ.. పెళ్లి చేసుకోమంటే హత్య చేసి.. పట్టిచ్చిన చెప్పులు...

By SumaBala BukkaFirst Published Dec 22, 2022, 9:59 AM IST
Highlights

ఓ వ్యక్తికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురు భార్యలున్నారు. కానీ, మరో మహిళతో ప్రేమాయనం కొనసాగించాడు. చివరికి పెళ్లి చేసుకోమంటే హత్య చేసి, స్నేహితుడి సహాయంో నదిలో పడేశాడు.

ముంబై : గాడి నది ఒడ్డున లభించిన మహిళ మృతదేహం కేసును ముంబై పోలీసులు చేధించారు. ఆమె వేసుకున్న బ్రాండెడ్ చెప్పుల ఆధారంగా కేసును చేధించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాథేరన్ ఫుట్ హిల్స్ దగ్గరున్న ధమని గ్రామ సమీపంలోని గాడి నది ఒడ్డున ఒక మహిళ మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ యూనిట్-2 బృందం దర్యాప్తు చేస్తోంది. 

కాగా, వీరి విచారణలో ఆమె వేసుకున్న బ్రాండెడ్ చెప్పులు కీలక ఆధారంగా మారి నిందితులను పట్టించాయి. ఈ కేసులో అప్పటికే ముగ్గురు భార్యలు ఉన్న  జిమ్ ట్రైనర్ అయిన బాదితురాలి బాయ్‌ఫ్రెండ్ ను,  మృతదేహాన్ని పారేయడానికి సహకరించిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

గాడి నది ఒడ్డున మహిళ మృతదేహం లభించడంతో.. గుర్తు తెలియని మహిళ మృతి కేసుగా.. డిసెంబర్ 14న పన్వేల్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. ఆ తర్వాత వారి విచారణలో ఆమె కోపర్‌ఖైరానేకు చెందిన ఊర్వశి వైష్ణవ్ (27) అనే మహిళ అని.. ఆమెను గొంతుకోసి చంపి, మృతదేహాన్ని నదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నది చుట్టుపక్కట సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు లేకపోవడంతో క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమె చెప్పుల సాయంతో నిందితులను కనిపెట్టారు.

రాహుల్ గాంధీ షూ లేస్ కట్టిన కేంద్ర మాజీ మంత్రి ? వీడియో ట్వీట్ చేసిన అమిత్ మాలవీయ.. అసలేం జరిగిందంటే ?

"కీలక నిందితుడు, డియోనార్‌కు చెందిన జిమ్ ట్రైనర్ రియాజ్ ఖాన్ (36), అతని సహాయకుడు ఇమ్రాన్ షేక్ (26)లను అరెస్టు చేశాం. ఇమ్రాన్ షేక్ గోవండిలో ఉంటాడు. కొరియర్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు" అని క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర పాటిల్ చెప్పారు. మొదట మృతురాలు ఎవరో గుర్తించాం. ఆ తరువాత ఆమె ఒంటిపై లభించిన బ్రాండెడ్ చెప్పుల సహాయంతో నిందితుడిని గుర్తించగలిగాం" అని పాటిల్ తెలిపారు. 

"చెప్పుల ఆధారంగా కేసును చేధించడంలో భాగంగా..  నవీ ముంబైలోని అన్ని ఫుట్‌వేర్ షాపులలో విచారణలు జరిపాం. ఆయా దుకాణాల్లో గత వారం రోజులుగా వచ్చివెళ్లినవారి సీసీటీవీ ఫుటేజీని కెమెరా తనిఖీ చేశాం. చివరకు, ఎనిమిది రోజుల క్రితం వాషిలోని ఒక దుకాణంలో ఆమె చెప్పులు కొన్నట్టుగా సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించింది. ఆమెతో పాటు మంచి శరీరసౌష్టవంతో  ఉన్న వ్యక్తి..బాడీబిల్డర్‌గా ఉన్నతను కనిపించాడు, దీంతో, అతను బాడీ బిల్డర్ అయి ఉండొచ్చని..  వాషి, కోపర్‌ఖైరానేలోని అన్ని జిమ్‌లలో అతని కోసం వెతికాం. చివరికి అతడిని కోపర్‌ఖైరానేలోని ఒక వ్యాయామశాలలో ట్రైనర్‌గా పనిచేస్తున్న రియాజ్ ఖాన్ అని గుర్తించాం" అన్నారు. 

పాటిల్ మాట్లాడుతూ, " గోవండిలో ఇమ్రాన్ ఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నాం. హత్యానంతరం రియాజ్ మహిళ మృతదేహాన్ని గాడి నదిలో పడేయడానికి ఇమ్రాన్ ఖాన్ సహాయం చేసినట్లు ఒప్పుకున్నాడు" అని తెలిపారు. ఊర్వశిని రియాజ్ గొంతుకోసి చంపాడని ఇమ్రాన్ తన విచారణలో తెలిపాడు.

click me!