
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గ్రేటర్ నోయిడాలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాలోని జోక్ రెస్టారెంట్‌లోకి బిర్యానీ తిందామని వెళ్లిన యువకులు ఆ బిర్యానీ రెస్టారెంట్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అన్సల్ మాల్‌లోని ఈ రెస్టారెంట్‌లో వారు బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. కానీ, వారి ఆర్డర్ సర్వ్ చేయడంలో కొంత జాప్యం జరిగింది. స్వల్ప జాప్యానికి కూడా వారు తట్టుకోలేకపోయారు. వెంటనే ఎదురుగా కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిపై దాడికి దిగారు. అయితే, కౌంటర్ దగ్గర ఇన్‌స్టాల్ చేసిన సీసీటీవీలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు చిక్కాయి. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు.
ఈ దాడికి సంబంధించి పోలీసు కేసు నమోదైంది. గ్రేటర్ నోయిడా లో నాలెడ్జ్ పార్క్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు అందింది. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, గ్రేటర్ నోయిడాలో అన్సల్ మాల్‌లో ఉన్న జోక్ రెస్టారెంట్‌లో బిర్యానీ ఆర్డర్ సర్వ్ చేయడంలో ఆలస్యం అయిందని సిబ్బంది దాడి జరిగిందని తెలిపారు.
దాడికి పాల్పడిన ముగ్గురు దాద్రి నుంచి వచ్చినట్టు తెలిపారు.