జమ్మూ కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం...

Published : Jan 07, 2022, 01:08 PM IST
జమ్మూ కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం...

సారాంశం

ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం రాత్రి నుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.  ఈక్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్ : కాశ్మీర్ లో terrorists ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య Counter fire జరిగాయి. ఈ Encounter లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు Security forcesవెల్లడించాయి.  బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. 

వారి నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం రాత్రి నుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.  ఈక్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని… ఈ ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ  ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత రెండు వారాల నుంచి జమ్ము కాశ్మీర్ లో వరుస ఎన్కౌంటర్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్కౌంటర్లలో దాదాపు ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్ లో వ‌రుస‌గా ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్నాయి. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు తమ దుర్మార్గపు కుట్రలను కొనసాగిస్తూ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌త రెండు వారాలుగా పాక్ - భార‌త్ స‌రిహ‌ద్దులో ఏదొక చోట ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డుతున్నారు. జనవరి 2న కూడా  జమ్ముకశ్మీర్​లో మ‌రో ఉగ్ర‌దాడి జరిగింది. 

శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో  ఉగ్ర‌దాడుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్మీ ఆధికారుల వివ‌రాల ప్ర‌కారం..   శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్క సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. 

ఈ క్ర‌మంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు.  

అలాగే.. జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భార‌త సైన్యం మ‌రో ఆపరేషన్ నిర్వ‌హించింది. ఈ ఆపరేష‌న్లో  ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆప‌రేష‌న్ ను  భారత సైన్యం,  జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్తంగా నిర్వ‌హించిన‌ట్టు ఆర్మీ ఆధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో ఉగ్ర‌వాదుల‌కు సంబంధించిన‌ నాలుగు ర‌హ‌స్య స్థావ‌రాలను భద్రతా బలగాలు ఛేదించారు.

ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.క్ర‌మంగా కాశ్మీర్ లోయ‌లో ఉగ్ర‌వాదులు గాల్పుల‌కు పాల్ప‌డుతూ.. భార‌త భూ భాగంలోకి చొర‌బ‌డుతున్నారు. దీంతో  భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. 

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?