ఛత్తీస్‌గఢ్‌: మందుపాతర పేల్చిన మావోలు.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

Siva Kodati |  
Published : Mar 23, 2021, 07:25 PM ISTUpdated : Mar 23, 2021, 07:26 PM IST
ఛత్తీస్‌గఢ్‌: మందుపాతర పేల్చిన మావోలు.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లా రిజర్వు గార్డ్స్‌ (డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును మందుపాతరలతో పేల్చేశారు. నారాయణపూర్‌ జిల్లాలో మంగళవారం 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లా రిజర్వు గార్డ్స్‌ (డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును మందుపాతరలతో పేల్చేశారు. నారాయణపూర్‌ జిల్లాలో మంగళవారం 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

నారాయణపూర్‌ జిల్లాలోని కడేనార్‌, కన్హరగావ్‌ల మధ్య వెళ్తున్న ఈ బస్సును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థీ మాట్లాడుతూ.. కూంబింగ్ నిర్వహించి తిరిగి క్యాంపులకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని మావోలు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో