మతిస్థిమితం లేని బాలిక.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి దారుణం..!

Published : Jul 09, 2021, 08:09 AM IST
మతిస్థిమితం లేని బాలిక.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి దారుణం..!

సారాంశం

 పథకం ప్రకారం.. బాలికను తమ ట్రాప్ లోకి లాగారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ నమ్మించారు. వారు మాటలను సదరు బాలిక నిజమని నమ్మేసింది. 

ఆ బాలికకు కనీసం మతి స్థిమితం కూడా లేదు. చూసి జాలిపడాల్సింది పోయి.. కామ వాంఛ తీర్చుకోవాలని అనుకున్నారు. పథకం ప్రకారం.. బాలికను తమ ట్రాప్ లోకి లాగారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ నమ్మించారు. వారు మాటలను సదరు బాలిక నిజమని నమ్మేసింది. దీంతో.. బస్సులోకి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని కోజికొడ్‌ జిల్లాకు చెందిన 21ఏళ్ల ఓ యువతికి మతిస్థిమితం లేదు. ఆ యువతి తరచు తన తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వస్తుంది.

అయితే జూలై 5న మరోసారి తన తల్లితో గొడవపడి ఊరి చివరకు వెళ్లింది. కొంత సమయం తర్వాత తాను ఇంటికి వెళ్లాలనుకొని రోడ్డుపై పలు వాహనాలను లిఫ్ట్‌ అడిగింది. ఆమెను గమనించిన ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్‌ ఇచ్చి ఇంటి వద్ద దింపుతామని బలవంతంగా ఓ ప్రైవేటు బస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఊరిలోని ఆటో స్టాండ్‌ వద్ద వదిలేసి పరారయ్యారు.

అయితే జరిగిన విషయాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా  ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని  చేవాయూర్ పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్