గురుగ్రామ్ బాణాసంచా పేలుడు ఘటనలో మరో ముగ్గురు మృతి... ఆరుకి చేరిన మరణాలు

By team teluguFirst Published Oct 21, 2022, 3:09 PM IST
Highlights

గురుగ్రామ్ లో గత వారం సంభవించిన అగ్రిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య శుక్రవాారం నాటికి ఆరుకి చేరింది. నిల్వ ఉంచిన బాణా సంచా పేలడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. 

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బాణాసంచా ఐదు రోజుల కిందట పేలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. అయితే పలువురికి గాయాలు కావడంతో వారిని హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: రాహుల్ గాంధీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజాగా మృతి చెందిన వారిలో 14 ఏళ్ల తనూజ్, 40 ఏళ్ల విష్ణు కాంత్, 40 ఏళ్ల సతీష్ ఉన్నారు. సతీష్ కాలాకి బంధువు కాగా తనూజ్ ఆయన కుమారుడు. సతీష్‌తో పాటు విష్ణు కాంత్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

ఆన్సర్ పేపర్ రివాల్యుయేషన్ చేసుకుంది.. స్టేట్ టాపర్‌గా నిలిచింది..!

ఈ పేలుడు అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం జరిగింది. ఈ భారీ పేలుడులో మొత్తంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, వారి బంధువు, డ్రైవర్‌తో కలిపి ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి యజమాని దాస్‌పై ఖేర్కీ దౌలా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఆయన వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో వినియోగించేందుకు బాణాసంచా సరఫరా చేస్తుండేవాడు. అందుకోసమే ఆయన తన ఇంట్లో క్రాకర్స్ ను నిల్వ చేసుకున్నాడు. 

click me!