ఆన్సర్ పేపర్ రివాల్యుయేషన్ చేసుకుంది.. స్టేట్ టాపర్‌గా నిలిచింది..!

By Mahesh KFirst Published Oct 21, 2022, 2:39 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో కనీసం మెరిట్ లిస్టులోనైనా లేని దివ్య అనే బాలిక హిందీ సబ్జెక్టు రివాల్యూయేషన్ చేసుకుంది. ఇందులో ఆమెకు అదనంగా 38 మార్కులు కలిసి వచ్చాయి. దీంతో యూపీ బోర్డు ఎగ్జామ్ ఫలితాల్లో ఆమెనే స్టేట్ టాపర్‌గా నిలిచారు. అంతకుముందు వరకు స్టేట్ టాపర్‌గా దివ్య సోదరి దివ్యాంశి ఉన్నది.
 

లక్నో: బోర్డు ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తారు. పాస్ కావాలనే బెంగతో ఫలితాల కోసం ఎదురుచూసే వారు కొందరైతే.. ఏ ర్యాంకు వస్తుందా అని కుతూహలంగా వెయిట్ చేసే వారు ఇంకొందరు. తాము అనుకున్నన్ని మార్కులు రాలేవని రివాల్యూషన్‌కూ వెళ్లేవారు ఉంటారు. కానీ, రివాల్యూయేషన్ ద్వారా టాప్ ర్యాంకర్లుగా మారడమైతే చాలా అరుదు. ఆత్మసంతృప్తి పొందుతారని, తాము రాసిన సమాధానాలకు తగిన ఫలితాలు వచ్చాయనే సాటిస్ఫాక్షన్ కోసం రిఎవల్యూయేషన్ చేసుకుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం రివాల్యూయేషన్ చేసుకున్న విద్యార్థిని పెరిగిన మార్కులతో స్టేట్ టాపర్‌గా మారింది. ఈ వార్త రాష్ట్రమంతటా చర్చనీయాశమైంది. అప్పటి వరకు స్టేట్ టాపర్‌గా తన ట్విన్ సోదరినే ఉండింది. కానీ, రిఎవల్యూయేషన్‌తో తన సోదరిని వెనక్కి పంపి ఆమె టాపర్‌గా నిలిచింది.

ఫతేపూర్ జిల్లాలో దివ్య, దివ్యాంశిలు కవల పిల్లలు. వారు యూపీలో 12వ తరగతి చదువుతున్నారు. ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇటీవలే రాశారు. ఫలితాలు కూడా వచ్చాయి. అందులో దివ్యాంశి మొత్తం 500 మార్కులకు గాను 477 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచారు. 

Also Read: లేడీ ఖిలాడీ.. అపార్ట్‌మెంట్‌లో గది అద్దాలను బయటి నుంచి క్లీన్ చేసిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

దివ్య  మాత్రం తనకు హిందీ సబ్జెక్టులో వచ్చిన మార్కులతో బాధగా ఉన్నది. తనకు ఇంకొన్ని మార్కులు రావాల్సి ఉండేదని అనుకుంది. ఆ హిందీ పేపర్‌ను రిఎవల్యూయేషన్‌కు దరఖాస్తు పెట్టుకుంది. ఈ రిఎవల్యూయేషన్‌లో ఆమెకు అదనంగా 38 మార్కులు కలిసివచ్చాయి. దీంతో ఆమె స్కోరు 479కు పెరిగింది. అంటే.. స్టేట్ టాపర్‌గా ఉన్న తన సోదరి దివ్యాంశి కన్నా మరో రెండు మార్కులు ఎక్కువ సాధించుకున్నట్టు అయింది. 

వీరిద్దరూ రాధానగర్‌లోని జై మా సరస్వతి జ్ఞాన్ మందిర్ ఇంటర్ కాలేజీలో చదువుతున్నారు. స్టేట్ మెరిట్ లిస్టులో దివ్యాంశి టాపర్‌గా నిలిచింది. దివ్య రిఎవల్యూయేషన్ తర్వాత మెరిట్ లిస్టును ప్రభుత్వం సవరించింది. దీంతో ఈ కాలేజీ నుంచి స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకర్లు సాధించినట్టయింది. నిజానికి తొలుత జూన్ 18న విడుదల చేసిన ఫలితాల్లో దివ్యాంశి టాపర్‌గా నిలవగా దివ్య మెరిట్ లిస్టులోనే లేదు. కానీ, రిఎవల్యూయేషన్‌తో ఆమెనే టాపర్‌గా మారారు.

Also Read: టపాసు కాల్చి... కింద పడి ముఖం పగలకొట్టుకున్న ఎమ్మెల్యే.. వైరల్ వీడియో..!

బోర్డు వెబ్‌సైట్‌లో సవరించిన నెంబర్లతో రెండో మార్క్ షీటును అప్‌లోడ్ చేసినట్టు డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవకి సింగ్ వివరించారు.

click me!