
గుజరాత్‌లోని హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగారు. అందిన సమాచారం ప్రకారం.. తల్లిదండ్రులతో పాటు కొడుకు, కూతుర్తె కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే.. తల్లి, తండ్రి, కొడుకు మృతి చెందగా కూతురు చికిత్స పొందుతోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సామూహిక ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. విషయం తెలియగానే పోలీసు కాన్వాయ్ ఆసుపత్రికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
కుటుంబీకులు వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం జునాగఢ్‌కు తరలించారు. ఈ ఘటనలో వికాస్ దుధాత్రా, హీనా దుధాత్రా, మనన్ దుధాత్రా మృతి చెందగా.. కుతూరు హ్యాపీ దుధాత్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా.. విషం తాగిన తర్వాత వికాస్ తన స్నేహితుడికి ఫోన్ చేసి.. తాను విషం తాగినట్టు తెలియజేశాడని వికాస్ సన్నిహితుడు ప్రదీప్ సవాలియా తెలిపారు. కాల్ అందుకున్న వెంటనే ప్రదీప్ సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర సేవలను కూడా సంప్రదించాడు. అయితే.. వారు ఆత్యహత్యకు పాల్పడటానికి గల కారుణాలు తెలియరాలేదు. ఈ కుటుంబం గురించి ఎటువంటి సమాచారం వెల్లడించనప్పటికీ, వారు తమ జీవితాలను ఎందుకు ముగింపు పలికారనేది ఇప్పటికి ప్రశ్నగానే ఉంది. పోలీసుల విచారణ తర్వాతే అసలు కారణం తేలనుంది.