కేరళలో ఘోరం... టూరిస్ట్ బస్సు లోయలో పడి ముగ్గురు మృతి, 16మందికి గాయాలు

Published : Apr 23, 2023, 12:33 PM ISTUpdated : Apr 23, 2023, 12:58 PM IST
కేరళలో ఘోరం... టూరిస్ట్ బస్సు లోయలో పడి ముగ్గురు మృతి, 16మందికి గాయాలు

సారాంశం

టూరిస్ట్ బస్సు లోయలో పడిపోయి ముగ్గురు మృతిచెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ దుర్ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కొచ్చి : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. 

తమిళనాడు తిరునల్వేలికి చెందిన కొందరు కేరళ మునార్ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు టూరిస్ట్ బస్సులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని ఇడుక్కి-కొచ్చి జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది.దీంతో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో 16 మంది  గాయాలపాలయ్యారు.

Read More హైవేపై బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. నలుగురు దుర్మరణం, 22 మందికి గాయాలు..

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడి సమీపంలోని హాస్పిటల్ కు  తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి సహా వళళియమ్మాల్(70), పెరుమాల్(50) వున్నారు ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?