అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Published : Jul 20, 2019, 07:28 AM IST
అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

సారాంశం

గత కొద్దిరోజులుగా అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. దీంతో.. ప్రజు భయంతో వణికిపోయారు.  

అరుణాచల్ ప్రదేశ్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. గత కొద్దిరోజులుగా అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. దీంతో.. ప్రజు భయంతో వణికిపోయారు.

అరుణాచల్ ప్రదేశ్  రాష్ట్రంలోని ఈస్ట్ కామెంగ్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం బొందిలకు ఈశాన్యంలో 64కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 

PREV
click me!

Recommended Stories

Plastic Currency: భారత మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.. పాత కరెన్సీ నోట్ల సంగతేంటి?
పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డ‌కు గోల్డ్ రింగ్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..