రజనీకాంత్ కసరత్తు: పార్టీ ప్రారంభానికి ఆ మూడు తేదీలే కీలకం?

Published : Dec 22, 2020, 01:52 PM IST
రజనీకాంత్ కసరత్తు:  పార్టీ ప్రారంభానికి ఆ మూడు తేదీలే కీలకం?

సారాంశం

సూపర్‌స్టార్ రజనీకాంత్  జనవరి మాసంలో పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి మాసంలో మూడు తేదీల్లో ఏదో ఒక రోజున పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  


చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్  జనవరి మాసంలో పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి మాసంలో మూడు తేదీల్లో ఏదో ఒక రోజున పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

వచ్చే ఏడాది జనవరి 14, 17, 21 తేదీల్లో ఏదో ఒక రోజున పార్టీని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

జనవరి 14వ తేదీ తమిళనాడుకు శుభ దినం. ఇది ఎందుకంటే థాయ్ నెల మొదటి రోజు. పొంగల్ రోజున జరుపుకొంటారు. జనవరి 17వ తేదీ ఎఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ పుట్టినరోజు. 

పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 31వ తేదీన రజనీకాంత్ ప్రకటన చేస్తానని తెలిపారు. రజనీకాంత్ సోదరుడు ఇటీవలనే యాగం నిర్వహించారు.  రాజకీయాల్లో రజనీకాంత్ రాణించాలని కోరుతూ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ ఈ యాగం చేశారు.

వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ   ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. మరో తమిళనటుడు కమల్ హాసన్ కూడా ఇప్పటికే పార్టీని ఏర్పాటు చేశారు. రజనీకాంత్ కు తనకు మధ్య స్నేహం అలాగే ఉందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?