దారుణం : చెరువులో చేపలు పట్టాడని.. దళిత యువకుడిపై మూత్ర విసర్జన..

Published : Jan 30, 2021, 12:40 PM IST
దారుణం : చెరువులో చేపలు పట్టాడని.. దళిత యువకుడిపై మూత్ర విసర్జన..

సారాంశం

తమిళనాడులో ఓ దళిత యువకుడిపై నలుగురు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. అతనిపై మూత్ర విసర్జన చేసి జుగుస్సాకరంగా అవమానించారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో జరిగింది.

తమిళనాడులో ఓ దళిత యువకుడిపై నలుగురు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. అతనిపై మూత్ర విసర్జన చేసి జుగుస్సాకరంగా అవమానించారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెడితే.. బాధితుడైన దళిత యువకుడు, అతని స్నేహితులతో కలిసి  చెరువులో చేపలు పడుతుండగా, తనికొండన్‌ గ్రామానికి చెందిన ప్రదీప్‌ అనే యువకుడితో వాగ్వాదం జరిగింది. దీంట్లో ప్రదీప్ దళిత యువకులపై కులంపేరుతో దూషణలకు దిగాడు. 

దీంతో ఆపకుండా ప్రదీప్ కాసేపటికి తన ముగ్గురు స్నేహితులతో  కలిసి వచ్చాడు. దళిత యువకుడిని బలవంతంగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడిపై భౌతిక దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. 

దీంతో ఊరుకోకుండా ఆ యువకుడి ఒంటిపై మూత్ర విసర్జన చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. దీనిమీద దర్యాప్తు చేపట్టామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamil Nadu Budget : ఫ్రీగా బంగారం, పట్టుచీర, సైకిళ్లు.. మనం కూడా ఇక్కడే పుడితే బావుండు అనిపించేలా స్కీమ్స్
Indian Railways: ట్రైన్‌లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !