ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ.. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్..

Published : May 26, 2023, 11:35 AM IST
ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ.. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్..

సారాంశం

ప్రధాని మోడీని చంపేస్తానంటూ ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు పీసీఆర్ కాల్ చేశాడు. అతను మద్యం మత్తులో బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

న్యూ ఢిల్లీ : ఓ వ్యక్తి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపు కాల్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ప్రకంపనలు సృష్టించింది. వెంటనే వారు కాల్‌ను ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కరోల్ బాగ్‌లో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని ఢిల్లీలోని రాయ్‌గర్ పురా నివాసి హేమంత్‌గా గుర్తించారు, అతను మద్యం మత్తులో కాల్ చేశాడు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. రూ. 75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం.. విశేషాలు ఇవే..

"పీసీఆర్ కాల్ అందుకున్న తర్వాత అక్కడికి ఒక బృందాన్ని పంపారు. కాలర్ హేమంత్ కుమార్ వయస్సు 48 సంవత్సరాలు S/o మల రామ్ R/o H నం. 72/5491, రాయగర్ పురా, కరోల్ బాగ్, పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాం. విచారణ చేశాం." అని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు గత 6 సంవత్సరాలుగా నిరుద్యోగి అని, అతనికి మద్యపానం అలవాటు ఉందని వారు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌