అయోధ్యలో కలకలం.. రామమందిరాన్ని కూల్చివేస్తామంటూ బాంబు బెదిరింపు.. 

Published : Feb 03, 2023, 02:39 AM IST
అయోధ్యలో కలకలం.. రామమందిరాన్ని కూల్చివేస్తామంటూ బాంబు బెదిరింపు.. 

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరాన్ని పేల్చేస్తామనే బెదిరింపుతో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. రామజన్మభూమిని పేల్చేస్తానని బెదిరించారని, దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.  

రామమందిరానికి బాంబు బెదిరింపు: అయోధ్యలో తీవ్ర కలకలం రేగింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని పేల్చివేస్తామంటూ.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే.. అధికారులు అప్రమత్తమమ్యారు. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్‌లో కల్పవాసం చేస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి,  ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని కల్పవస్‌లో ఉన్నాడు, వెంటనే మనోజ్ కుమార్.. పోలీసులకు సమాచారమిచ్చారు.

తనకు ఉదయం 5:00 గంటల సమయంలో బెదిరింపు కాల్ వచ్చిందని, రాబోయే 5 గంటల్లో అంటే.. ఉదయం 10:00 గంటలకు వరకు శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణకు దిగారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.  

ఈ సమాచారం ఆధారంగా మొదట పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు . ఆ తర్వాత అయోధ్య నిఘా బృందం చురుకుగా మారింది. కాల్ రికార్డుల ఆధారంగా అయోధ్య పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రామ మందిరాన్ని పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని అరెస్టు చేయడానికి పోలీసు బృందం బయలుదేరింది . త్వరలో పోలీసు అధికారులు కూడా అతనిని అరెస్టు చేయనున్నట్టు తెలుస్తుంది.  

మరోవైపు, ఈ విషయానికి సంబంధించి నగర ఎస్పీ అయోధ్య మధువన్ సింగ్ మాట్లాడుతూ.. ఈ వ్యవహరం రామజన్మభూమి అయోధ్య పోలీస్ స్టేషన్‌కు చెందినదని అన్నారు. ప్రస్తుతం అలహాబాద్‌లో కల్పవస్‌ చేస్తున్న రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌కుమార్‌కు ఉదయం 5:00 గంటలకు మొబైల్‌కు బెదిరింపు కాల్ వచ్చిందనీ, ఆ కాల్ ఢిల్లీ నుండి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ రోజు (గురువారం) ఉదయం 10:00 గంటలకు రామజన్మభూమిని పేల్చివేస్తానని బెదిరించారనీ, ఈ సమాచారం అందుకున్న పోలీస్ స్టేషన్ చీఫ్ వెంటనే కేసు నమోదు చేసి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ వ్యక్తి ఆచూకీ కోసం మా బృందం త్వరలో అతడిని అరెస్ట్ చేసి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం