నేను స్వెటర్ ఎందుకు వేసుకోలేదంటే?.. భారత్ జోడో ముగింపు సభలో రాహుల్ గాంధీ వెల్లడి

By Mahesh KFirst Published Jan 30, 2023, 6:29 PM IST
Highlights

ఎట్టకేలకు రాహుల్ గాంధీ స్వెటర్ వేసుకోలేదో వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లో ఆయన జోడో యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ కొందరు చిన్నారులు తనలో కల్పించిన ప్రేరణ గురించి మాట్లాడుకొచ్చారు.
 

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తన వైట్ టీషర్ట్ మార్క్‌లోనే కనిపించారు. కఠిన చలిలోనూ ఆయన స్వెటర్ ధరించకపోవడం చర్చనీయాంశం అయింది. ఆయన పాదయాత్ర ఢిల్లీకి చేరిన తర్వాత ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. రాహుల్ గాంధీకి చలి ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తే.. ఆయన దాటవేసే సమాధానాలే చెప్పారు. జమ్ము కశ్మీర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన తన బాడీని కాపాడుకోవడానికి వెచ్చగా ఉంచే దుస్తులు ధరించారు. ఈ రోజు జమ్ము కశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జమ్ము కశ్మీర్‌లో మాట్లాడారు. అక్కడే తాను భారత్ జోడో యాత్రలో స్వెటర్ ఎందుకు ధరించలేదనే ప్రశ్నకు సమాధానం వెల్లడించారు.

‘భారత్ జోడో యాత్ర చేస్తుండగా నా వద్దకు నలుగురు పిల్లలు వచ్చారు. వారు యాచకులు. వారికి ఒంటిపై దుస్తులు లేవు. నేను వారిని హగ్ చేసుకున్నాను. వారంతా చల్లగా వణికిపోతూ ఉన్నారు. వారికి తినడానికి అన్నం కూడా ఉండి ఉండకపోవచ్చు. వారు జాకెట్ లేదా స్వెటర్ ధరించనప్పుడు నేను కూడా ధరించను’ అని నిర్ణయించుకున్నట్టు రాహుల్ గాంధీ తెలిపారు. 

Also Read: శ్రీన‌గ‌ర్ లో జెండా ను ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. 4080 కిలో మీట‌ర్ల ప్రయాణంతో భారత్ జోడో యాత్రకు జమ్ము కశ్మీర్ లో ముగింపు

అదే విధంగా మరో విషయాన్నీ ఆయన పంచుకున్నారు. ‘భారత్ జోడో యాత్ర ద్వారా నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఒక రోజు నా కాళ్లు విపరీతంగా నొప్పులు పెడుతున్నాయి. నేను మరో ఆరు నుంచి ఏడు గంటలు ఎక్కువగా నడవాల్సి ఉన్నదని అనిపించింది. కానీ, అది నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ, ఓ చిన్నారి బాలిక నా వద్దకు పరుగున ఉరికి వచ్చింది. ఆమె నా కోసం ఏదో రాసుకు వచ్చినట్టు చెప్పింది. ఆమె నన్ను ఆలింగనం చేసుకుని పరుగున వెళ్లిపోయింది. నేను ఆ చిట్టిని చదవడం మొదలు పెట్టాను. ఆమె ఇలా రాసింది. ‘‘మీ మోకాళ్లు నొప్పి పెడుతున్నాయని నేను చూశాను. మీ మోకాళ్ల మీద మీరు బరువు పెట్టినప్పుడు ఆ నొప్పి మీ ముఖంలో కనిపిస్తున్నది. నేను మీతో నడవలేను. కానీ, మనస్సులో నేను మీ పక్కనే నడుస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మీరు నా కోసం, నా భవిష్యత్ కోసం నడుస్తున్నారు’ సరిగ్గా అదే సమయంలో నా నొప్పి కొట్టుకుపోయింది’ అని రాహుల్ గాంధీ అన్నారు.

click me!