స్ట్రాబెర్రీతో బిర్యానీ.. ఇదెక్కడి కాంబినేషన్ రా బాబు..!

Published : Jun 21, 2023, 12:56 PM IST
 స్ట్రాబెర్రీతో బిర్యానీ.. ఇదెక్కడి కాంబినేషన్ రా బాబు..!

సారాంశం

స్ట్రాబెర్రీలు బిర్యానీ తయరీలో వేయడం ఎప్పుడైనా చూశారా? ఇదేం కాంబినేషన్ రా బాబు అనిపిస్తుందా? తాజాగా ఓ వ్యక్తి అలానే చికెన్ బిర్యానీ చేశాడు.  

బిర్యానీ ఈజ్ ఎమోషన్.  మనలో చాలా మందికి బిర్యానీ అంటూ చాలా ఇష్టం. బిర్యానీలో చాలా రకాలు మనకు తెలుసు. బిర్యానీ తయారు చేసేటప్పుడు చాలా రకాల మసాలా దినుసులు వాడుతుంటారు.  కానీ, స్ట్రాబెర్రీలు బిర్యానీ తయరీలో వేయడం ఎప్పుడైనా చూశారా? ఇదేం కాంబినేషన్ రా బాబు అనిపిస్తుందా? తాజాగా ఓ వ్యక్తి అలానే చికెన్ బిర్యానీ చేశాడు.


ప్రపంచవ్యాప్తంగా, బిర్యానీ లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి.  ఒక్కొక్కరు ఒక్కో  రకం బిర్యానీ తినడాన్ని ఇష్టపడతారు. బిర్యానీ చేయడానికి ముక్కలు చేసిన మాంసం, బంగాళాదుంపలు , వివిధ మసాలా ప్యాలెట్‌లను కూడా కొందరు ఉపయోగిస్తారు, అయితే ఈ రైస్ డిష్‌లో స్ట్రాబెర్రీలను ఉంచడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?


పుష్పేక్ సిద్ధూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో  బ్రిటిష్ వ్యక్తి  చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో బిర్యానీ తయారు చేశాడు. వీడియోలో వ్యక్తి బిర్యానీ  తయారు చేసేటప్పుడు స్ట్రాబెర్రీలు వేయడం విశేషం. మీరు ఇలాంటి బిర్యానీ ఎప్పుడైనా రుచి చూశారా అంటూ క్యాప్షన్  చేయడం విశేషం. ఈ వీడియోకి 452 వేల వ్యూస్ రావడం విశేషం. నెటిజన్లు ఈ స్ట్రాబెర్రీ బిర్యానీ కాంబినేషన్ అస్సలు బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు