ఢిల్లీ మెట్రోలో మరో ముద్దుల ఫోటో వైరల్.. మెట్రో స్పందించిన తీరును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..

Published : Jun 21, 2023, 11:45 AM IST
ఢిల్లీ మెట్రోలో మరో ముద్దుల ఫోటో వైరల్.. మెట్రో స్పందించిన తీరును  ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..

సారాంశం

ఢిల్లీ మెట్రోలో ఓ జంట ముద్దులు పెట్టుకుంటున్న ఫొటో ట్విట్టర్‌లో షేర్ అయ్యి వైరల్ గా మారింది. దీనిమీద ఢిల్లీ మెట్రో ఆలస్యంగా స్పందించడాన్ని ట్రోల్ చేస్తున్నారు. 

ఢిల్లీ : ఢిల్లీ మెట్రోలో గలీజ్ పనులు చేస్తూ కెమెరాలకు చిక్కిన అనేక ఘటనలు వెలుగు చూశాయి. ఆ కోవలోనే మరో ఫొటో వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోను షేర్ చేస్తే ఢిల్లీ మెట్రోను కూడా టాగ్ చేశారు. కానీ ఈ పోస్ట్ కు ఢిల్లీ మెట్రో ఆలస్యంగా స్పందించింది. దీంతో నెటిజన్లు మెట్రోను ట్రోల్ చేస్తున్నారు. 

ఇక ఢిల్లీ మెట్రోలోని ఇలాంటి ఘటనల మీద పలువురు స్టాండ్-అప్ కమెడియన్లు కామెడీలు కూడా చేశారు. వీరు చేసేది జోకులు కాదు నిజమే అని నిరూపిస్తూ ఢిల్లీ మెట్రోలో జంట ముద్దులు పెట్టుకుంటున్న మరో ఫొటో వైరల్ అయ్యింది. 

రైలు కంపార్ట్‌మెంట్‌లో ఒక జంట ముద్దు పెట్టుకుంటున్నట్లు ట్విట్టర్‌లో మరొక పోస్ట్ షేర్ చేయబడింది. "#DelhiMetro #yellowline వద్ద T2C14 ప్రక్కనే హుడా సిటీ సెంటర్ దగ్గర కనిపిస్తున్న ఈ సీన్ చూడండి" అనే హెడ్డింగ్ తో ఈ ఫొటోను జూన్ 17న పోస్ట్ చేశారు.దీనికి రెండు రోజుల తరువాత ఢిల్లీ మెట్రో స్పందించింది. 

“హాయ్. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. హుడా సిటీ సెంటర్‌లో తనిఖీ చేశాం. అలాంటి ప్రయాణీకులు కనిపించలేదు” అని రిప్లై ఇచ్చింది. ఢిల్లీ మెట్రో ఘటన మీద దాని స్పందనకు సంబంధించిన ట్వీట్ ను కూడా షేర్ చేశారు. 

ఇప్పుడు ఈ ట్వీట్ నే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తరువాత ప్రయాణికులు ఇంకా అక్కడే ఉంటారా? అధికారులు ఆ మాత్రం అర్థం కాదా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్