అలా చేస్తే కరోనా థర్డ్‌వేవ్ ‌కి కట్టడి: ఎయిమ్స్ డైరెక్టర్

By narsimha lodeFirst Published Jul 1, 2021, 5:37 PM IST
Highlights

కరోనా ప్రోటోకాల్స్ ను కచ్చితంగా పాటిస్తే కోవిడ్ థర్డ్‌వేవ్ గురించి భయపడాల్సిన  అవసరం లేదని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: కరోనా ప్రోటోకాల్స్ ను కచ్చితంగా పాటిస్తే కోవిడ్ థర్డ్‌వేవ్ గురించి భయపడాల్సిన  అవసరం లేదని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.కరోనా ప్రోటోకాల్స్ తో పాటు వ్యాక్సినేషన్ పై కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సిన్ వేయడంపై కేంద్రీకరించాలన్నారు. ఈ రెండు పాటిస్తే కరోనా థర్డ్ వేవ్ వచ్చినా కూడ పెద్దగా ప్రమాదం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్ మిక్సింగ్ పై ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయమై మరింత డేటా అవసరం ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. యాక్టివ్ కేసులు కూడ తగ్గుతున్నాయని ఆయన తెలిపారు.అయితే కొన్ని చోట్ల కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాలు కూడ ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాలను గుర్తించి కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.దేశంలో కరోనా కేసులు లక్షలోపు నమోదౌతున్నాయి. లాక్ డౌన్ తో పాటు కఠిన ఆంక్షల మూలంగా కేసుల సంఖ్య తగ్గిపోయింది. 


 

click me!