మహారాష్ట్ర : జేసీబీతో ఏటీఎమ్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. వీడియో వైరల్

Siva Kodati |  
Published : Apr 24, 2022, 05:50 PM IST
మహారాష్ట్ర : జేసీబీతో ఏటీఎమ్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. వీడియో వైరల్

సారాంశం

మహారాష్ట్రలోని సాంగ్లీలో ఏటీఎం మిషన్‌ను జేసీబీతో పెకలించి తీసుకెళ్లిపోయారు దోపిడి దొంగలు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 

మహారాష్ట్రలోని (maharashtra) సాంగ్లీలో (Sangli) దొంగలు బరితెగించారు. మిరాజ్ ప్రాంతంలో ఏకంగా ఏటీఎం మిషన్‌ను జేసీబీతో (jcb) ఎత్తికెళ్లారు. శనివారం అర్ధరాత్రి యాక్సిస్ బ్యాంక్ (axis bank atm) ఏటీఎంను అపహరించిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో బుల్డోజర్‌పై చర్చ జరుగుతోంది. అయితే ఈ సమయంలో చోరీకి దొంగలు బుల్డోజర్‌ను ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. బుల్డోజర్‌ నిర్మాణాలు కూల్చడానికే కాదు…ఇలా చోరీలకు కూడా ఉపయోగపడుతోందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ బాస్‌గా నితిన్ నబిన్.. మోదీ, షా వేసిన ఈ మాస్టర్ స్కెచ్ వెనుక అసలు కథ ఇదే !
Tata Sierra : మీ దగ్గర రూ.2 లక్షలుంటే చాలు.. న్యూ టాటా సియెర్రా ఇంటికి తీసుకెళ్లండి