మహారాష్ట్రలో కొందరు దొంగలు ఏటీఎం చోరీకి వెళ్లారు. ఏటీఎం ఓపెన్ చేయడానికి గ్యాస్ కటర్ ఉపయోగించారు. ఆ నిప్పు లోపలి పరికరాలను ధ్వంసం చేసింది. నోట్లు దాచి పెట్టె విభాగం కూడా కాలిపోయింది. దీంతో సుమారు రూ. 21 లక్షల విలువైన నోట్లు కాలి బూడిదైపోయాయి.
Viral: మహారాష్ట్రలోని కొందరు దొంగలు ఏటీఎం నుంచి డబ్బులు దొంగిలించాలని అనుకున్నారు. అందుకోసం ఏటీఎం ఎంచుకున్నారు. టైం కూడా సెట్ చేసుకున్నారు. ఆ ఏటీఎంను ఎలా తెరువాలా? అందులో నుంచి డబ్బులు ఎలా కాజేయాలా? అనే ప్లాన్ కూడా వేసుకున్నారు. అనుకున్నట్టుగానే రాత్రి 1 నుంచి 2 గంటల మధ్యలో మహారాష్ట్ర థానేలోని ఓ జాతీయ బ్యాంకు ఏటీఎం షటర్ ధ్వంసం చేసి లోనికి వెళ్లారు. ఆ ఏటీఎం ఓపెన్ చేయడానికి గ్యాస్ కటర్ ఎంచుకున్నారు. గ్యాస్ కటర్ వెలిగించారు. ఏటీఎంను గ్యాస్ కటర్‌తో కట్ చేయడం మొదలు పెట్టారు. అయితే, ఆ గ్యాస్ కటర్ నుంచి వచ్చిన నిప్పు ఏటీఎం లోపలి వరకు వెళ్లింది. దీంతో అందులోని నోట్ల కట్టలూ కాలి బుగ్గి అయ్యాయి.
డొంబివలి పట్టణంలోని విష్ణు నగర్ ఏరియాలోని ఓ జాతీయ బ్యాంక్ ఏటీఎం కియోస్క్‌లో జనవరి 13వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ‘కొందరు ఆగంతకులు జనవరి 13వ తేదీన రాత్రి 1 గంటల నుంచి 2 గంటల మధ్య ఏటీఎం కియోస్క్ షటర్ తాళాలు పగుల గొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. వాళ్లు ఏటీఎం ఓపెన్ చేయడానికి గ్యాస్ కటర్ ఉపయోగించారు. అయితే, దాని నుంచి వచ్చే తీవ్రమైన వేడి ఏటీఎం లోపల నిప్పు రాజేసింది’ అని అధికారులు వివరించారు.
Also Read: Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం
ఏటీఎం లోపలి పరికరాలు ధ్వంసమైపోయాయి. నగదు దాచి ఉంచె ఇనుప పెట్టె కూడా మండిపోయింది. దీంతో సుమారు రూ. 21,11,800 నగదు నోట్లు కాలిపోయాయి. సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.