శరద్ పవార్ క్యాంపులోకి తిరిగి ధనుంజయ్ ముండే

By Sandra Ashok KumarFirst Published Nov 23, 2019, 5:42 PM IST
Highlights

క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు, ఒక్క క్షణం ఒకదగ్గర కనపడ్డ వ్యక్తి మరు నిమిషం ఎక్కడ ప్రత్యక్షమవుతాడో అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతం గనుక చూసుకుంటే, 5గురు ఎమ్మెల్యేలు మాత్రమే అజిత్ పవార్ కి మద్దతు ఇస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం మారుతున్నాయి. అజిత్ పవార్ అత్యంత ఆప్తుడైన ధనంజయ్ ముండే ఎన్సీపీ పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సూత్రధారైన గోపినాథ్ తిరిగి రావడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. 

ముంబై నుండి ఢిల్లీ తరలించడానికి సిద్ధంగా ఉన్న రెబెల్ ఎన్సీపీ ఎమ్మెల్యేలైన  దౌలత్ ధరోడా, నరహరి జిర్వార్, సునీల్ భుసారా , దిలీప్ బంకర్, అనిల్ భాయ్ దాస్ పాటిల్, నితిన్ పవార్, సునీల్ శెలకే, బాబా సాహెబ్ పాటిల్, సంజయ్ బన్సన్ ల నుంచి ఇద్దరు తిరిగి శరద్ పవార్ వద్ద చేరారు.  సునీల్ శెలకే, సునీల్ భుసారాలు తిరిగి శరద్ పవార్ క్యాంపులో చేరిపోయారు. 

ఒక్క క్షణం ఒకదగ్గర కనపడ్డ వ్యక్తి మరు నిమిషం ఎక్కడ ప్రత్యక్షమవుతాడో అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతం గనుక చూసుకుంటే, 5గురు ఎమ్మెల్యేలు మాత్రమే అజిత్ పవార్ కి మద్దతు ఇస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

అజిత్ పవార్ కి మద్దతిచ్చేందుకు ఎవరి ఇంట్లో అయితే ఈ రెబెల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారో, ఆ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ఇప్పుడు తిరిగి శరద్ పవార్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. 

ఎన్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలతోని ఇప్పటికే ఎన్సీపీ సీనియర్లు చర్చలు జరుపుతున్నాయి. శరద్ పవార్ కూడా స్వయంగా అజిత్ పవార్ ని కూడా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. 

అజిత్ పవార్ ని వెనక్కి తీసుకోవడానికి మాత్రం పవార్ కుటుంబం సిద్ధంగా లేదన్న వార్తలు వినపడుతున్నాయి. కానీ రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుంది చెప్పడం మాత్రం కష్టం. 

click me!