షాకింగ్.. కేంద్ర మంత్రి ఇంట్లోనే చోరీ..

Published : Sep 23, 2019, 07:35 AM IST
షాకింగ్.. కేంద్ర మంత్రి ఇంట్లోనే చోరీ..

సారాంశం

న్యూఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో మంత్రి సత్యేందర్ జైన్ ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు పలు వస్తువులను దోచుకెళ్లారు. మంత్రి భార్య పూనం జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.   

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దొంగలు ఏకంగా కేంద్ర మంత్రి ఇంటికే కన్నం వేశారు. ఢిల్లీ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఇంట్లో దొంగలు పడ్డారు. న్యూఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో మంత్రి సత్యేందర్ జైన్ ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు పలు వస్తువులను దోచుకెళ్లారు. మంత్రి భార్య పూనం జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

‘‘సరస్వతీ విహార్ లోని నా ఇంట్లో దొంగలు పడ్డారు...భవనం అన్ని అంతస్తుల్లో దొంగలు గాలించి పలు వస్తువులను చోరీ చేశారు. దొంగలు, సంఘవ్యతిరేక శక్తులకు ఢిల్లీ పోలీసులంటే భయం లేదు’’ అని మంత్రి సత్యేందర్ జైన్ చోరీ ఘటనపై ట్వీట్ చేశారు. మంత్రి ఇల్లు ఆరు నెలలుగా తాళం వేసి ఉండటంతో చోరీ జరిగిందని స్థానికులు చెప్పారు. మంత్రి ఇంట్లోని బెడ్ రూం, కిచెన్ లలో పలు వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని ఢిల్లీ డీసీపీ కోన్ చెప్పారు. కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నామని డీసీపీ వివరించారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు