నాకే ఆహారం లేదంటావా.. దాబా యజమానిపై కానిస్టేబుల్ కాల్పులు

Siva Kodati |  
Published : Sep 22, 2019, 04:55 PM IST
నాకే ఆహారం లేదంటావా.. దాబా యజమానిపై కానిస్టేబుల్ కాల్పులు

సారాంశం

నాకే ఫుడ్ లేదని చెబుతావా అంటూ కోపంతో ఊగిపోయిన సందీప్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఆహారం లేదన్న చిన్న మాటకు ఓ హోటల్ యజమానిపై కాల్పులు జరిపాడో కానిస్టేబుల్.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా ముజఫర్‌నగర్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లో సీజీవోగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ బాలియన్ శుక్రవారం రాత్రి 10 గంటలకు భోజనం కోసమని దగ్గర్లోని దాబాకు వెళ్లాడు.

అయితే అప్పటికే అర్థరాత్రి కావొస్తుండటంతో ఆహారం లేదని దాబా యజమాని ఆజాద్ కుమార్ పేర్కొన్నారు. నాకే ఫుడ్ లేదని చెబుతావా అంటూ కోపంతో ఊగిపోయిన సందీప్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే ఈ ఘటనలో ఆజాద్ కుమార్ తృుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆయన ఫిర్యాదు మేరకు సందీప్‌పై సెక్షన్ 307 కింద పొలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?