అప్పుడు ముగ్గురు కాలేజ్ ఫ్రెండ్స్.. ఇప్పుడు బిజినెస్‌మెన్లు.. ఆన్‌లైన్ బేకరీ ప్రారంభించి కోట్ల వ్యాపారం

Published : Aug 31, 2022, 03:04 PM IST
అప్పుడు ముగ్గురు కాలేజ్ ఫ్రెండ్స్.. ఇప్పుడు బిజినెస్‌మెన్లు.. ఆన్‌లైన్ బేకరీ ప్రారంభించి కోట్ల వ్యాపారం

సారాంశం

ముగ్గుర కాలేజీ ఫ్రెండ్స్ డిగ్రీలు పట్టుకుని యూనివర్సిటీ గేట్లు దాటి బయటకు వచ్చారు. కొన్ని సంవత్సరాలు కార్పొరేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు చేశారు. చివరకు ఆ ఉద్యోగాలకు బైబై చెప్పి సొంతంగా వ్యాపారం పెట్టారు. ఆన్‌లైన్ బేకరీ ప్రారంభించి కోట్ల వ్యాపారం చేస్తున్నారు.  

న్యూఢిల్లీ: వారు ముగ్గురు కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజీ చదువు ముగించుకుని ఇంటర్వ్యూల్లో పడ్డారు. జాబ్‌లకు సెలెక్ట్ అయ్యారు. కార్పొరేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు కూడా చేశారు. కానీ, ఆ ఉద్యోగాలు వారిని సంతృప్తి పెట్టలేకపోయాయి. బిజినెస్ పెట్టాలని అనుకున్నారు. వారి మైండ్‌లో ఓ ఆలోచన మెదులుతున్నది. దానికే సాన పెట్టారు. సక్సెస్ ఫుల్ బిజినెస్మెన్లుగా ఎదిగారు. అనతి కాలంలోనే వారు కోట్ల వ్యాపారం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహెగల్, సుమన్ పాత్రాలు ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 2006, 2007లలో డిగ్రీలతో బయటకు వచ్చారు. కొన్ని సంవత్సరాలు వారు కార్పొరేట్ జాబ్ చేశారు. వారు ఎంటర్‌ప్రెన్యూవర్లుగా మారాలని అనుకున్నారు. ముందుగా ఓ ఆన్‌లైన్ ఫ్లవర్, కేక్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ కంపెనీని 2010లో ప్రారంభించారు.

గురుగ్రామ్‌లోని ఓ బేస్‌మెంట్‌లో ఫ్లవర్ ఔరా ఆన్‌లైన్ కంపెనీ ప్రారంభించామని సుమన్ తెలిపారు. 2010 ఫిబ్రవరిలో రూ. 2 లక్షల పెట్టుబడితో ఈ వెంచర్ ప్రారంభించారు. ‘తొలి దశలో తాము కేవలం ఒకే ఒక్క ఉద్యోగిని నియమించుకున్నాం. అతనే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, డెలివరీ సహా ఇతర ఆపరేషన్లు చూసుకునేవాడు’ అని వివరించారు. సుమాన్ ఈ సంస్థ ప్రారంభమైన ఏడాది తర్వాత వచ్చి చేరారు.

అయితే, వారు ప్రారంభించిన కొన్ని నాళ్లకే వాలెంటైన్స్ డే వచ్చింది. అప్పుడు తమకు ఆర్డర్‌లు భారీగా వచ్చాయని  సహ వ్యవస్థాపకుడు హిమాన్షు, శ్రేయ్‌లు పేర్కొన్నారు. ‘ఆ రోజు నేను, హిమాన్షు ఇద్దరం తమకు వచ్చిన 50 ఆర్డర్‌లను ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో డెలివరీ చేశాం’ అని శ్రేయ్ అన్నారు.

ఈ కంపెనీకి విశేష స్పందన వచ్చింది. సంస్థను విస్తరించడానికి ఇదే సరైన సమయం అని వారు భావించారు. 2016లో హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహెగల్, సుమన్ పాత్రాలు కలిసి వేరే బ్రాండ్ పేరుతో బేకింగ్ అనే ఆన్‌లైన్ బేకరీ కంపెనీని ప్రారంభించారు. ఒకే బ్రాండ్, ఒకే టేస్ట్‌తో, ఫ్రెష్ కేక్‌లను వేర్వేరు ప్రాంతాల్లో అందించాలనే ఐడియాతో దీన్ని ప్రారంభించారు.

తమ కంపెనీ చాలా రకాల కేక్‌లను కేవలం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్ వంటి పెద్ద నగరాల్లోనే కాదు.. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ అందుబాటులో ఉంటాయని వారు చెప్పారు.

సుమారు 30 శాతం బేకింగో అమ్మకాలు వారి సొంత వెబ్ సైట్ ఆధారంగా జరుగుతాయి. మిగితా 70 శాతం ఇతర ఫుడ్ పోర్టల్స్ స్విగ్గీ, జొమాటో వాటి ద్వారా జరుగుతాయని తెలిపారు.

ఆర్థిక సంవత్సరం 2021, 2021 కల్లా ఈ కంపెనీ 75 కోట్ల టర్నోవర్ సాదించింది. ఈ కంపెనీలో నేడుసుమారు 500 మంది పని చేస్తున్నారు. ఈ ఏడాది బేకింగో తొలి ఆఫ్‌లైన్ షాప్‌ను ఢిల్లీలో ప్రారంభించింది.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు