మద్యానికి డబ్బులిచ్చి.. చికెన్ కర్రీ వండి భర్తను ప్రియుడి దగ్గరికి పంపిన భార్య.. తరువాత ఏమైందంటే ?

Published : Aug 14, 2023, 12:29 PM IST
మద్యానికి డబ్బులిచ్చి.. చికెన్ కర్రీ వండి భర్తను ప్రియుడి దగ్గరికి పంపిన భార్య.. తరువాత ఏమైందంటే ?

సారాంశం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య ప్రియుడి సాయంతో తన భర్తను హతమార్చింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ దంపతులకు పెళ్లయి కొన్ని సంవత్సరాలు అవుతోంది. చక్కగా సాగిపోతున్న కాపురం. కొంత కాలం తరువాత వీరి జీవితాల్లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతడితో భార్యకు సన్నిహిత్యం పెరిగింది. కొంత కాలం తరువాత వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరి బంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించారు. అందుకే అతడిని హతమార్చాలని వారిద్దరూ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ లో భాగంగా భార్య.. భర్తకు మద్యం కొనేందుకు డబ్బులిచ్చి, చికెన్ కర్రీ వండించి తన ప్రియుడి దగ్గరికి పంపించింది. దీంతో అతడు మరి కొందరు సాయంతో భర్తను హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని పైడిభీమవరం పంచాయతీ పరిధిలోని వరిసాం గ్రామంలో జీరు బాలకృష్ణ-సునీత అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుతుర్లు ఉన్నారు. బాలయ్య రోజు వారి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే సునీతకు భర్త స్నేహితుడైన కంబాల వెంకటరమణతో సన్నిహిత్యం పెరిగింది. కొంత కాలం తరువాత అది వివాహేతర సంబంధంగా మారింది. 

అయితే ఈ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని వారిద్దరూ భావించారు. అందుకే బాలకృష్ణ హతమార్చాలని అనుకున్నారు. దీని కోసం పక్కా ప్లాన్ వేశారు. ఎవరికీ దొర్కకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్లాన్ లో భాగంగా గత ఆదివారం రాత్రి భార్య సునీత భర్తకు మందు కొనుగోలు చేయాలని డబ్బులు ఇచ్చింది. ఇంట్లో చికెన్ కర్రీ కూడా వండింది. స్నేహితులతో మందు తాగి, చికెన్ తిని రావాలని కూడా సూచించింది. దీంతో బాలకృష్ణ వాటిని తీసుకొని కంబాల వెంకటరమణ దగ్గరికి వెళ్లారు. 

అక్కడ వీరిద్దరూ అఖిల్‌, రాములు అనే వ్యక్తులతో కలిసి నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మద్యం తాగారు. అనంతరం బాలకృష్ణను నోరు మూసి, ఛాతీపై బలంగా బాదారు. దీంతో అతడు చనిపోయాడు. అయితే ఇది గుండెపోటు వల్ల వచ్చిన మరణంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. బాలకృష్ణ జేబులో మద్యం బాటిల్ ఉంచి, ఓ మర్రి చెట్టు కింద పడుకోబెట్టారు.  ముఖానికి, చేతలుకు అక్కడక్కగా గాట్లు పెట్టారు. అంటే మద్యం తాగి, కింద పడిపోయి, గుండెపోటుతో మరణించాడని అందరూ భావించాలని వారి ప్లాన్. 

మరుసటి రోజు ఉదయం మర్రిచెట్టు కింద డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే మృతుడు గత రాత్రి కంబాల వెంకటరమణ, అఖిల్‌, రాములు అనే వ్యక్తులతో కలిసి మద్యం తాగడం తాము చూశామని స్థానికులు పోలీసులకు తెలిపారు. వీరు ముగ్గురు రాత్రి 12 గంటల సమయంలో ఓ దాబా దగ్గర ఉండటం తాను చూశానని ఓ కానిస్టేబుల్ కూడా చెప్పారు. 

దీంతో  కంబాల వెంకటరమణ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు నిజాన్ని అంగీకరించాడు. ఈ హత్యకు కె.దుర్గాప్రసాద్‌, రాము అనే వ్యక్తులు కూడా సహకరించారని వెల్లడించాడు. దీంతో భార్య సునీత, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌