'తిత్లీ ఉడి' పాడిన గొంతు ఇక లేదు.. ప్రముఖ సింగర్ శారద కన్నుమూత..

Published : Jun 15, 2023, 08:42 AM IST
'తిత్లీ ఉడి' పాడిన గొంతు ఇక లేదు.. ప్రముఖ సింగర్ శారద కన్నుమూత..

సారాంశం

‘‘తిత్లీ ఉడి’’ అంటూ పాడుతూ సంగీత ప్రియులను ఆనందింపజేసిన ఆ గొంతు మూగపోయింది. శ్రావ్యమైన గొంతుతో ఎన్నో మంచి పాటలు పాడిన ప్రముఖ నేపథ్య గాయని శారద తన 89 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. 

1966లో వచ్చిన 'సూరజ్' చిత్రంలోని 'తిత్లీ ఉడి' పాటకు ఫేమస్ అయిన నేపథ్య గాయని శారద(89) క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆరు నెలల పాటు చికిత్స పొందిన ఆమె ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణవార్తను ఆమె కుమార్తె మదీరా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ట్విట్టర్ లో చరిత్ర సృష్టించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. 25 మిలియన్లు దాటిన ఫాలోవర్ల సంఖ్య

మదీరా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషాద వార్తను పోస్ట్ చేశారు. ‘క్యాన్సర్ తో సుదీర్ఘ, సాహసోపేతమైన పోరాటం తర్వాత మా ప్రియమైన తల్లి, నేపథ్య గాయని శారదా రాజన్ ఈ ఉదయం కన్నుమూశారని నేను, నా సోదరుడు షమ్మీ రాజన్ చాలా విచారంతో ప్రకటిస్తున్నాం. 25.10.1933 - 14.06.2023. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు. ఉదయం ఆమె ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా ఆమె చికిత్స పొందుతోంది. కాగా.. ఆమె మరణం పట్ల సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 

శారద పూర్తి పేరు శారదా రాజన్ అయ్యంగార్. తమిళనాడుకు చెందిన ఆమెకు చిన్న వయస్సు నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టం. పలు సందర్భాల్లో ఆమె తన అభిరుచిని ప్రదర్శించేవారు. శారద 1960-1970 లలో గణనీయమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ముఖ్యంగా, జహాన్ ప్యార్ మిలే (1970) చిత్రంలోని ‘‘బాత్ జరా హై ఆపస్ కీ’’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. అయితే సూరజ్ (1966) చిత్రంలోని "తిత్లీ ఉడి" పాటతో ఆమె అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆ పాటతోనే ఆమెను గుర్తుంచుకున్నారు.

దారుణం.. పశువులను తరలిస్తున్న వ్యక్తిని కొట్టి చంపిన గోరక్షకులు..

2007 లో ఆమె మీర్జా గాలిబ్ కాలాతీత గజల్స్ ఆధారంగా తన స్వంత కూర్పులను ప్రదర్శిస్తూ ‘అందాజ్-ఎ-బయాన్ ఔర్’ అనే ఆల్బమ్ ను ఆవిష్కరించింది. ప్యారిస్ లోని "లే జా లే జా లే జా మేరా దిల్", గుమ్నామ్ లోని "ఆ ఆయేగా కౌన్ యాహాన్", దిల్ దౌలత్ దునియాలోని "మస్తీ ఔర్ జవానీ హో ఉమర్ బది మస్తానీ హో" వంటి పాటలు ఆమె పాడిన ఇతర ముఖ్యమైన పాటల లిస్టులో ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్